అన్వేషించండి

Theatrical And OTT Releases: ఈ వారం థియేటర్లలో ‘జవాన్‘తో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఢీ - ఓటీటీలోకి ‘జైలర్’ ఎంట్రీ!

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సినీ అభిమానులకు ఈ వారం మంచి ఎంటర్ టైన్మెంట్ లభించనుంది. థియేటర్లలో ‘జవాన్’, ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ సినిమాలు విడుదలకానున్నాయి. ఓటీటీలో ‘జైలర్’ సహా 18 చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఈ వారం సందడి చేసే సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..  

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు

1. ’జవాన్’- సెప్టెంబర్ 7న విడుదల

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'జవాన్' సినిమా విడుదల కానుంది. సౌత్ క్వీన్ నయనతార ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇందులో ప్రియమణి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై ఆయన సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. షారుఖ్ బ్లాక్ బస్టర్ ‘పఠాన్’ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

2. ‘Miss. శెట్టి పొలిశెట్టి’ - సెప్టెంబర్ 7న విడుదల

సౌత్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.  అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా రాబోతోంది. 'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె నటించిన సినిమా ఇది. మరోవైపు 'జాతిరత్నాలు' వంటి బ్లాక్‍ బాస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి చేస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. ఇందులో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్ వీడియో

  1. వన్ షాట్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5న విడుదల
  2. లక్కీ గై (హిందీ చిత్రం)-సెప్టెంబర్ 6న విడుదల
  3. రజనీకాంత్ జైలర్ మూవీ- సెప్టెంబర్ 7న విడుదల
  4. సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 8న విడుదల

నెట్ ఫ్లిక్స్

  1. షేన్ గిల్లీస్ (హాలీవుడ్)- సెప్టెంబర్ 5 న విడుదల
  2. స్కాట్స్ హానర్ (హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 5న విడుదల
  3. కుంగ్ ఫూ పాండా (వెబ్ సిరీస్-సీజన్ 3)- సెప్టెంబర్ 7న విడుదల
  4. టాప్ బాయ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- సెప్టెంబర్ 7న విడుదల
  5. సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్-సీజన్ 2)- సెప్టెంబర్ 8న విడుదల
  6. వర్జిన్ రివర్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 7న విడుదల

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  1. ఐయామ్‌ గ్రూట్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) - సెప్టెంబర్‌ 6న విడుదల
  2. ద లిటిల్‌ మెర్మాయిడ్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 6న విడుదల

జీ5

  1. హడ్డీ - సెప్టెంబర్‌ 7న విడుదల

ఆహా

  1. లవ్ (తమిళ చిత్రం)- సెప్టెంబర్ 8న విడుదల

బుక్‌ మై షో

  1. లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 8న విడుదల

లయన్స్‌ గేట్‌ ప్లే

  1. ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్‌ మూవీ) - సెప్టెంబర్‌ 8న విడుదల

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  1. ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌) - సెప్టెంబర్‌ 8న విడుదల

హైరిచ్‌

     1. ఉరు(మలయాళం) - సెప్టెంబర్‌ 4న విడుదల

Read Also: జైలర్’ సక్సెస్ జోష్ - మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు లగ్జరీ కారు గిఫ్ట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget