By: ABP Desam | Updated at : 05 Sep 2023 01:13 PM (IST)
అనిరుధ్, కళానిధి మారన్ (Photo Credit: Sun Pictures/twitter)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రజనీకాంత్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘జైలర్’ నిలిచింది. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమా అనుకున్న దానికంటే అద్భుత విజయాన్ని అందుకోవడంతో నిర్మాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ‘జైలర్’ సక్సెస్ లో భాగస్వాములైన వారికి అదిరిపోయే బహుమతులను ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
తాజాగా ‘జైలర్’ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ ను కళానిధి మారన్ సర్ ప్రైజ్ చేశారు. విలువైన పోర్షే కారుతో పాటు చెక్ ను అందజేశారు. ఈ చెక్ ద్వారా ఆయనకు రూ. 1 కోటి రూపాయలు అందజేసినట్లు తెలుస్తోంది. స్వయంగా కళానిధి మారన్ అనిరుధ్ ఇంటికి వెళ్లి కారును బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ వేదికగా ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. కళానిధి గిఫ్ట్ పట్ల అనిరుధ్ సంతోషం వ్యక్తం చేశారట. ‘జైలర్’ మూవీ విజయంలో అనిరుధ్ అందించిన మ్యూజిక్ సైతం కీలక పాత్ర పోషించింది. హుకుమ్ తలైవర్ అలప్పారా, కావాలయ్యా సాంగ్స్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేలా చేశాడు. ప్రస్తుతం అనిరుధ్ దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సంగీత దర్శకులలో అనిరుధ్ ఒకరు. అంతేకాదు, అనిరుధ్ రజనీకాంత్ భార లతకు స్వయంగా మేనల్లుడు కావడం విశేషం.
Mr.Kalanithi Maran congratulated @anirudhofficial and handed over a cheque, celebrating the mammoth success of #Jailer#JailerSuccessCelebrations pic.twitter.com/GRbiSKcuW1
— Sun Pictures (@sunpictures) September 4, 2023
To celebrate the humongous Blockbuster #Jailer, Mr. Kalanithi Maran presented the key of a brand new Porsche car to @anirudhofficial#JailerSuccessCelebrations pic.twitter.com/lbkiRrqv7B
— Sun Pictures (@sunpictures) September 4, 2023
అటు ఇప్పటికే ‘జైలర్’ హీరో రజనీకాంత్ కు కళానిధి మారన్ రూ.1.24 కోట్ల విలువైన లగర్జీ BMW కారును బహుమతిగా అందించారు. కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. డైరెక్టర్ నెల్సన్‌కు కూడా లేటెస్ట్ లగ్జరీ పోర్చే కారును బహుమతిగా అందించారు. ఈ కారు ఖరీర్ కూడా రూ. కోటికి పైనే ఉంటుదని తెలుస్తోంది. ఫ్యాన్సీ అమౌంట్ తో కూడిన చెక్ ను కూడా అందించారు. కళానిధి మారన్ స్వయంగా కలిసి ఈ కార్లను, చెక్స్ ని అందచేశారు. దీనికి సంబంధించిన దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు మరికొంత మంది చిత్రబృందానికి కూడా కళానిధి మారన్ బహుమతులు అందించినట్లు తెలుస్తోంది.
ఇక అద్భుత విజయాన్ని అందుకున్న ‘జైలర్’ మవీ సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు.
Read Also: మళ్లీ ప్రేమలో పడ్డ లలిత్ మోడీ - సుశ్మితా సేన్‌తో బ్రేకప్ తర్వాత ఎవరితో డేటింగ్ చేస్తున్నారో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
/body>