The Raja saab First Song : రీల్స్... ఫీల్స్... 'రెబల్ సాబ్' యూట్యూబ్ షేక్స్! - ప్రభాస్ 'ది రాజా సాబ్' సాంగ్‌పై తమన్ ఎలివేషన్
Rebel Saab Song : ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి 'రెబల్ సాబ్' సాంగ్ వచ్చేస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్ ఆ హైప్ పదింతలు చేశాయి.

Thaman About The Raja Saab First Song Rebel Saab : డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ అయిపోయింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాబోతోన్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ పాటను ఆదివారం రిలీజ్ చేయనున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'రెబల్ సాబ్'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ఎలివేషన్ వీడియో వైరల్ అవుతోంది.
రెబల్ సాబ్... యూట్యూబ్ షేక్
'ది రాజా సాబ్'లో రెబల్ సాబ్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేయడం కన్ఫర్మ్ అని అన్నారు తమన్. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ సాంగ్ సోషల్ మీడియాను కుమ్మేయబోతోందని చెప్పారు. 'మొత్తానికి రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రెడీ అయిపోయింది. ఇంకొక రోజు ఓపిక పడితే రేపు ప్రోమో. ఎల్లుండి సాంగ్. ఇప్పుడే లిరికల్ వీడియో చూశా. డార్లింగ్ 12 ఏళ్ల తర్వాత యూట్యూబ్‌ను కుమ్మేయబోతున్నాడు. అసలు మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ ఫుల్ లవ్ ఇట్. గెట్ రెడీ టు గెట్ ఆల్ ద రీల్స్. అండ్ ద ఫీల్స్ చలి వణికింగ్స్. రెబల్ సాబ్ సాంగ్‌తో కలుద్దాం.' అంటూ ఎలివేషన్ ఇచ్చారు.
Also Read : మహేష్ 'వారణాసి' మ్యూజిగ్, సాంగ్స్ - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన కీరవాణి... ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ చేసేశారుగా!
'ది రాజా సాబ్' నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ జానర్‌లో నటించడం... స్టైలిష్, వింటేజ్ లుక్ వేరే లెవల్‌లో ఉండడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని... సరికొత్త ప్రభాస్‌ను చూడబోతున్నారంటూ డైరెక్టర్ మారుతి ఇచ్చిన ఎలివేషన్‌తో ఆ హైప్ పదింతలు అవుతోంది. ఇక ఫస్ట్ సాంగ్‌పై అప్డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ వేరే లెవల్‌లో ఉంది. ఫుల్ జోష్, ఎనర్జీతో ప్రభాస్ వింటేజ్ లుక్, స్టెప్ అదిరిపోయింది. సాంగ్ రిలీజ్ కాక ముందే 'రెబల్ సాబ్' వైబ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పాట రిలీజ్ అయితే యూట్యూబ్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.
సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్!
ఈ పాటతో పాటే ఇక వరుస సర్‌ప్రైజ్‌లు మూవీ రిలీజ్ వరకూ ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా... వీటీవీ గణేష్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.





















