అన్వేషించండి

Thalapathy Vijay : ట్రెండింగ్‌లో విజయ్ టెన్త్ మార్క్ షీట్ - దళపతికి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా!

Vijay Marks List : తమిళ రాజకీయాల్లో సంచలనం టీవీకే అధినేత విజయ్. ప్రస్తుతం ఆయన టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Thalapathy Vijay's Tenth Class Marks List : తమిళ రాజకీయాల్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ఓ సంచలనం. రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించి ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్‌గా పోటీలో నిలిచి 108 స్థానాల్లో అఖండ విజయం సాధించారు. ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ వేస్తూ తమిళ ప్రజల మనసులు గెలుచుకున్నారు. అయితే, సీఎం పీఠం అధిరోహించాలంటే ఇంకా 10 సీట్ల మెజార్టీ కావాలి. ఇందు కోసం దళపతి పావులు కదుపుతున్నారు.

గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు, ఇతర స్టార్స్... విజయ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ పరిణామాలతో అటు ఇండస్ట్రీ ఇటు సోషల్ మీడియాలో విజయ్ పేరు మార్మోగుతోంది. తాజాగా ఆయన టెన్త్ మార్క్స్ లిస్ట్ ట్రెండ్ అవుతోంది.

ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులంటే?

విజయ్ తన 10వ తరగతి పరీక్షల్లో 65 శాతం మార్కులు సాధించారు. మొత్తం 1100 మార్కులకు గానూ 711 మార్కులు సాధించారు. తన మాతృ భాష తమిళంలో 200కి 155 మార్కులు తెచ్చుకుని టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత సైన్స్‌లో 300కి 206, ఇంగ్లీష్‌లో 200కి 133, సోషల్‌లో 200కి 122, మ్యాథ్స్‌లో 200కి 95 మార్కులు సాధించారు. అన్నింటి కంటే తక్కువ మార్క్స్ మ్యాథ్స్‌లోనే వచ్చాయి.

చెన్నైలో స్కూల్ ఎడ్యుకేషన్

విజయ్ తన స్కూల్ ఎడ్యుకేషన్‌ను చెన్నైలోనే ప్రారంభించారు కోడంబాక్కంలోని ఫాతిమా పాఠశాలలో చదివి, ఆ తర్వాత విరుగంబాక్కంలోని బాలలోక్ స్కూల్‌కు మారారు. ఆ తర్వాత టెన్త్ పరీక్షలు రాసి... స్కూల్ విద్య పూర్తయ్యాక చెన్నైలో లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివేందుకు చేరారు. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో డిగ్రీ మధ్యలోనే ఆపేసి సినిమాల వైపు అడుగులేశారు. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి డిగ్రీ ఆపేసిన అదే లయోలా కాలేజీలోనే ఎమ్మెల్యేగా గెలుపు పత్రం అందుకున్నారు. 

Also Read : సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు? - తమిళనాడు పొలిటికల్ పరిస్థితిపై ప్రకాష్ రాజ్, కమల్, విశాల్ రియాక్షన్

Also Read : రామ్ చరణ్ పెద్ది ఎడిట్ కంప్లీట్ - భారీ స్థాయిలో ప్రీమియర్స్... మెగా మాసివ్ ట్రీట్ కన్ఫర్మ్

సీఎంగా విజయ్ ప్రమాణం ఎప్పుడు?

తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు హాట్ టాపిక్‌గా మారాయి. ఓవైపు విజయ్‌కు ఇతర స్టార్స్ సపోర్ట్ పెరుగుతుండడంతో పాటు గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సపోర్ట్ ఇచ్చే 118 మంది ఎమ్మెల్యే లిస్ట్‌తోనే రావాలని గవర్నర్ విజయ్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించగా... కాంగ్రెస్ సపోర్ట్‌తో బలం 112కు చేరింది. ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన త్వరగా మద్దతు సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని తమిళ ప్రజలతో పాటు అభిమానులు కోరుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Lenin Collections : 100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
Srinivasa Mangapuram Review - 'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Ramayana Trailer : మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం
మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget