అన్వేషించండి

happy birthday Sunitha: సునీత జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క పాట - హీరోయిన్‌గానూ అవకాశాలు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

singer Sunitha birthday today: దశాబ్ధాలుగా స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న సునీత కెరీర్‌ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. తొలి పాటతోనే ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె సినీ ప్రస్థానంపై ఓ లుక్కేయండి

Happy Birthday Singer Sunitha: ఇండస్ట్రీలో సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. సింగర్స్‌ అంతా వేరు.. సునీత వేరు అనేంతగా తన గానం, రూపుతో ఆకట్టుకున్నారామే. తనదైన యాటిట్యూడ్‌తో ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న సునీతకు స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌లో క్రేజ్‌ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఏకైక మహిళా సింగర్‌ ఈమే. ఏ మహిళా సింగర్‌కు కూడా లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఈమే సొంతమనే చెప్పాలి.

అంతగా తన మధురమైన గాత్రంతో ఆకట్టుకుంటున్న సునీత తనదైన కట్టు బోట్టుతో కట్టిపడేస్తుంది. ప్లే బ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అయినా సునీత తెరపై కనిపిస్తే చాలు అభిమానులంత మంత్రముగ్ధులైపోతారు. తన గానంతో ఎంతోమంది సంగీత అభిమానులను సంపాదించుకున్న ఆమె పుట్టిన రోజు నేడు. 1978 మే 10న విజయవాడలో జన్మించిన సునీత చిన్న వయసులోనే గాయనీగా కెరీర్‌ ప్రారంభించారు. తన కుటుంబంలోని వారంత సంగీత విద్యాంసులు, కళాకారులు కావడంతో చిన్నతంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.

చిన్న వయసులోనే..

అలా 13 ఏళ్లకే తన గురువుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 'పాడుతా తీయగా' తెలుగు సింగింగ్ షోలో పాల్గొని తన మధురమైన గాత్రంతో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఆకట్టుకున్నారు. ఈ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాలో పాడే అవకాశాన్ని అందుకున్నారు. అలా జేడీ చక్రవర్తి, మల్లీశ్వరి నటించిన 'గులాబి' సినిమాతో ప్లేబ్యాక్‌ సింగర్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో ఆమె పాడిన 'ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో' పాట ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పాలి. అప్పట్లో ఈ పాట ఓ సన్సేషన్‌. ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఈ పాట సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ దెబ్బతో సునీత పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

తొలి పాటతోనే ఫుల్ క్రేజ్

తొలి పాటతోనే స్టార్‌ సింగర్‌గా మారిన సునీత.. ఇప్పటికీ సక్సెస్‌ ఫుల్‌ గాయనీగా కొనసాగుతున్నారు. అంతేకాదు డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ తన శ్రావ్యమైన గొంతుతో దశాబ్ధాలుగా అలరిస్తూ వస్తున్నారామె. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఆమె సుమారు 9 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇక సింగర్‌గా ఎన్నో ఫిలిం ఫేర్‌, రాష్ట్ర అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నారు. వెండితెరపై ఆమె సోనాలి బెంద్రే, సౌందర్య, జ్యోతిక, ఛార్మి, నయనతార, తమన్నా, అనుష్క, జెనీలియా, శ్రియా సరన్, సదా, త్రిష, భూమిక, స్నేహ, మీరా జాస్మిన్, లైలా, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ వంటి స్టార్‌ హీరోయిన్లకు తన గాత్రం (వాయిస్ ఓవర్) అందించారు. అలా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా దాదాపు 500 వందల సినిమాలకు తన గొంతు ఇచ్చారట. ఇక కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌ గానూ అవకాశాలు వచ్చినా సున్నితంగా వాటిని తిరస్కరించారట. లిసిందే.

19 ఏళ్లకే పెళ్లి..

ఇండస్ట్రీలో తనకంటూ పరిమితులు పెట్టుకుని గాయనీగా ఎదిగిన సునీత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్న సంగతి తె 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సునీత వైవాహిక జీవితం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకన్న సునీత ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. వారి పేర్లు ఆకాశ్‌(కొడుకు) శ్రేయ(కూతురు). అయితే పెళ్లయిన కొంతకాలానికి మనస్పర్థలతో భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిన సునీత ఒంటరిగి జీవిస్తూ పిల్లలను పోషించుకుంది. ప్రస్తుతం సునీత కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. కూతురు శ్రీయా కూడా సింగర్‌. చాలా కాలం తర్వాత సునీత రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ టైంలో మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  2021 జనవరి 9, శనివారం వీరి వివాహం జరిగింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget