Suhas: కోలీవుడ్‌లోకి టాలెంటెడ్ హీరో సుహాస్ ఎంట్రీ - ఎలాంటి రోల్ చేయబోతున్నాడో తెలుసా?
Suhas Tamil Industry Entry: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ఇప్పుడు తాజాగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ స్టార్ కమెడియన్ స్టార్ కమెడియన్ సూరి హీరోగా వస్తోన్న 'మందాడి' మూవీలో నటించనున్నారు.

Hero Suhas Entry In Kollywood With Mandaadi Movie: డిఫరెంట్ కథాంశాలు ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ నటుడు సుహాస్ (Suhas). షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత హీరోగా ఎదిగారు. కరోనా సమయంలో 'కలర్ ఫోటో' సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఈ సినిమాతోనే సుహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 'కలర్ ఫోటో' మూవీకి నేషనల్ అవార్డు రావడంతో స్టార్ హీరోగా మారారు.
తమిళంలో ఎంట్రీ
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఆయన తాజాగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ కమెడియన్ టర్న్‌డ్ హీరో సూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మందాడి'లో (Mandaadi) నటించనున్నారు. దీంతో ఆయన కోలీవుడ్ డెబ్యూపై ఆసక్తి నెలకొంది. ఎప్పుడూ విభిన్న పాత్రల్లో నటించి మెప్పించే సుహాస్.. ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేయబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీకి మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా.. సుహాస్‌తో పాటు సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఆర్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం వహిస్తున్నారు.
Talented @ActorSuhas enters Kollywood through the world of #Mandaadi ⛵🔥#Mandaadi #MandaadiTitleLook pic.twitter.com/hCusHZZbn5
— Shreyas Sriniwaas (@shreyasmedia) April 18, 2025
తెలుగులో మంచి హిట్స్ సాధించిన సుహాస్ తమిళంలోనూ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్, సినీ ప్రియులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే, ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సుహాస్ చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన తమిళ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు.
Also Read: తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
వరుస సినిమాలతో బిజీ బిజీ
తొలుత షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత 'కలర్ ఫోటో' మూవీతో స్టార్ హీరోగా ఎదిగారు సుహాస్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మజిలి, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గమనం, ఫ్యామిలీ డ్రామా మూవీస్‌లో సీరియల్ కిల్లర్ రోల్‌లో నటించారు. అడవిశేష్ 'హిట్ 2' మూవీలో విలన్‌గా ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం సినిమాల్లో హీరోగా నటించారు.
సుహాస్ లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామ' మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమె ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మూవీలో అలీ, బబ్లూ పృథ్వీరాజ్, రవీందర్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోదాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హరీష్ నల్ల నిర్మిస్తుండగా.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ మూవీని రిలీజ్ చేయబోతోంది. అలాగే, కీర్తి సురేష్‌తో కలిసి 'ఉప్పు కప్పు రంబు'లో నటించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.






















