News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

దిల్ రాజుకే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పగ్గాలు - సి.కళ్యాణ్‌తో హోరాహోరి, ఎవరికి ఎన్ని ఓట్లంటే..

టీఎఫ్‌సీసీ ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు విజేతగా నిలిచారు. ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టార్‌లో క్లియర్ మెజారిటీ లభించినా.. డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్‌లో ఫలితాలు టై కావడంతో ఫలితాలు ఆలస్యమయ్యాయి.

FOLLOW US: 
Share:

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌(Telugu Film Chamber Of Commerce) ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా సాగాయి. అయితే, ఫలితాల్లో మాత్రం చివరి వరకు ఉత్కంఠత నెలకొంది. నిర్మాత దిల్ రాజు ప్యానెల్‌లో అత్యధిక ఓట్లతో లీడింగులో ఉండటంతో వారే విజేత అని భావించారు. కానీ, డిస్ట్రిబ్యూటర్స్.. ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లలో ఓట్లు ఫలితాలు టై అయ్యాయి. 

దిల్ రాజు  vs సి.కళ్యాణ్: ఎవరెవరికి ఎన్ని?

దిల్ రాజు ప్యానెల్‌లో ప్రొడ్యూసర్ సెక్టార్‌లో పోటీ చేసిన 12 మందిలో ఏడుగురు విజయం సాధించారు. సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్ విజేతలుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1339 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో పోల్ అయిన 891 ఓట్లలో దిల్ రాజు ప్యానెల్‌కు 563, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజుకు ప్యానెల్‌కు చెందినవారే గెలిచారు.

అయితే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌‌లో ఇద్దరికి చేరొక 6, ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లో చెరొక 8 మంది గెలవడంతో ఫలితాలు టై అయ్యాయి. మెజారిటీ సాధించాలంటే అన్ని సెక్టార్లు కలిపి 25 ఓట్లు ఉండాలి. అయితే, తుది ఫలితాల్లో దిల్ రాజ్‌ ప్యానెల్‌లో మొత్తం 24 మంది, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 20 మంది అభ్యర్థులు గెలుపొందారు. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 25 ఓట్లు కావాలి. దీంతో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్ణయాన్ని వెల్లడించారు. చివరికి  31 మంది మద్దతుతో దిల్ రాజునే విజేతగా నిలిచి.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Published at : 30 Jul 2023 09:23 PM (IST) Tags: Dil Raju C Kalyan Film chamber Elections Result TFCC Elections Telugu Film Chamber Elections Result TFCC President Dil Raju

ఇవి కూడా చూడండి

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్