అన్వేషించండి

Teja Sajja: ‘జై హనుమాన్’పై తేజ సజ్జా కీలక అప్డేట్ - ఆశలు వదులుకోవల్సిందే

Jai Hanuman: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నో సినిమాల్లో ‘జై హనుమాన్’ కూడా ఒకటి. తాజాగా హీరో తేజ సజ్జా ఈ మూవీపై కీలక అప్డేట్‌ను అందించాడు.

Teja Sajja about Jai Hanuman: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ చాలా థియేటర్లలో ఇంకా ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ‘హనుమాన్’ ఈ రేంజ్‌లో హిట్ అవ్వడంతో తన సినిమాటిక్ యూనివర్స్‌లోని రెండో సినిమాపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్ వర్మ. ‘జై హనుమాన్’ అనే పేరుతో ‘హనుమాన్’కు సీక్వెల్ తెరకెక్కనుందని ఇప్పటికే రివీల్ చేశాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం అమెరికాకు కూడా వెళ్లొచ్చాడు. తాజాగా హీరో తేజ సజ్జా కూడా ‘జై హనుమాన్’ గురించి ఆసక్తికరమైన అప్డేట్‌ను బయటపెట్టాడు.

ప్రశాంత్ అలాగే అంటారు..

‘హనుమాన్’ హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏడాదికి ఒకటి విడుదల చేస్తానని అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. అందుకే వచ్చే ఏడాదిలో ‘జై హనుమాన్’ మూవీ రిలీజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా తేజ సజ్జా మాత్రం అలా జరగకపోవచ్చనే ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేశాడు. ముందుగా ‘హనుమాన్’ సక్సెస్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తేజ అన్నాడు. అదే క్రమంలో ‘జై హనుమాన్’ అప్డేట్ గురించి అడగగా.. దానికి ఇంకా చాలా టైమ్ ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది ‘జై హనుమాన్’ వస్తుందని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశారని గుర్తుచేయగా.. ‘‘మా ప్రశాంత్ గారు హనుమాన్ కూడా వెంటనే వచ్చేస్తుందన్నారు. కానీ ఆయన టైమ్ ఆయన తీసుకున్నారు. వీలైనంత త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’’ అని రివీల్ చేశాడు తేజ సజ్జా.

ఆశగా ఎదురుచూపులు..

‘జై హనుమాన్’కు సమయం పడుతుంది కాబట్టి ఈలోపు వేరే ప్రాజెక్ట్స్‌తో రావడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాడు తేజ సజ్జా. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘జై హనుమాన్’ కూడా ఒకటి. ఈ మూవీ 2025లో విడుదల అవుతుందని ప్రశాంత్ వర్మ స్వయంగా అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తేజ సజ్జా చెప్పినదాని ప్రకారం ఈ సినిమా 2025లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. క్యాస్టింగ్ కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఆ తర్వాత షూటింగ్ త్వరగానే పూర్తయినా ‘హనుమాన్’లాగానే ‘జై హనుమాన్’కు కూడా పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుంది.

మళ్లీ అదే పాత్రలో..

ఏ రకంగా చూసినా.. ‘జై హనుమాన్’ 2025లో కంటే 2026లోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘హనుమాన్’ సినిమాలో హనుమంతు పాత్రలో కనిపించిన తేజ సజ్జా.. ‘జై హనుమాన్’లో కూడా అదే పాత్రలో కనిపించి అలరించనున్నాడు. ఇక హనుమంతుడి పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నట్టు ప్రశాంత్ వర్మ ఇప్పటికే రివీల్ చేశాడు. ‘హనుమాన్’ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించి.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Also Read: రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ భామ - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ ఫాదర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget