అన్వేషించండి

Tanushree Dutta: నా ప్రాణానికే ముప్పు ఉంది - మరోసారి హీరోయిన్ తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్

Tanushree Dutta Comments: తన ప్రాణానికే ముప్పు ఉందని తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా. ఇటీవల తన ఇంట్లోనే వేధింపులకు గురైనట్లు ఆమె చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Tanushree Dutta Shocking Comments On Her Life Threat: బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి షాకింగ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. తన ఇంట్లోనే తాను వేధింపులకు గురవుతున్నట్లు ఇటీవల కన్నీళ్లు పెట్టుకుని ఓ వీడియో రిలీజ్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రాణ హాని ఉందంటూ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

నన్ను చంపాలని చూస్తున్నారు

వేధింపులపై తాను ఇటీవల చేసిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి వరుస ఇంటర్వ్యూల కోసం ఎంతోమంది తనకు ఫోన్ చేస్తున్నట్లు తనుశ్రీ తెలిపారు. గత కొంతకాలంగా తాను ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడినట్లు... అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదని చెప్పారు. 'నాకు హెల్త్ బాగాలేదు. కొన్ని రోజులుగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నా. అందరితోనూ త్వరలోనే మాట్లాడతా. కాకుంటే దానికిి టైం పడుతుంది. దయచేసి నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి.' అని అన్నారు తనుశ్రీ.

Also Read: 'కింగ్‌డమ్‌'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?

బాలీవుడ్ మాఫియా ముఠా

బాలీవుడ్ మాఫియా ముఠా చాలా పెద్దదని తనుశ్రీ తెలిపారు. 'ముంబయిలో నా ప్రాణానికి ముప్పు ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లానే నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. అతనిలానే నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేయగా వైరల్ అవుతున్నాయి.

ఇటీవలే తనుశ్రీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారని... పోలీసులకు చెప్తే స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటున్నారని చెప్పారు. 'గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. నాకు నమ్మకంగా ఉంటారని పనివాళ్లను పెట్టుకుంటే నా వస్తువుల్ని చోరీ చేస్తున్నారు. నా ఇంట్లోనే నాకు సేఫ్టీ లేకుండా పోయింది. నేను 2020 నుంచి ఇలాంటి పెద్ద పెద్ద శబ్దాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పైకప్పు, తలుపు బయట నుంచి దాదాపు రోజూ ఇలా పెద్ద పెద్ద చప్పుళ్లతో అగచాట్లు పడుతున్నా. బిల్డింగ్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫిర్యాదులు చేసి విసిగిపోయాను. ఫలితం లేదని వదిలేశాను. నాకు కాస్త హెల్ప్ చేయండి.' అంటూ ఆవేదనతో వీడియో రిలీజ్ చేశారు.

అసలెవరీ తనుశ్రీ?

బాలీవుడ్‌లో ఒకప్పుడు తనుశ్రీ ఓ వెలుగు వెలిగారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని మూవీస్‌లో తనదైన నటనతో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. బిహార్‌కు చెందిన ఈమె 2004 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచారు. 'ఆషిక్ బనాయా ఆప్నే' పాటతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తెలుగులో 'వీరభద్ర' మూవీలోనూ నటించారు. 2013 వరకూ బాలీవుడ్‌లోనే పలు మూవీస్ చేశారు. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.

ఆ తర్వాత 2018లో 'మీటూ' (#Metoo) ఉద్యమంలో భాగంగా నానా పాటేకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఆరోపించగా... విచారణలో పటేక‌ర్‌కు క్లీన్ చిట్ వచ్చింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తనను ఓ మూవీ కోసం నగ్నంగా డ్యాన్స్ చేయాలని అడిగారంటూ అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా... తనకు ప్రాణ హాని ఉందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget