తమన్నా చెయ్యి పట్టుకున్న అభిమాని - మిల్కీ బ్యూటీ చేసిన పనికి అంతా షాక్
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లగా.. అక్కడ ఓ అభిమాని బౌన్సర్ల నుండి తప్పించుకుని తమన్నా చేయిని పట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఎక్కడ చూసినా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన తమన్నా, ఆ మధ్యలో సినిమా అవకాశాలు లేక డల్ అయ్యింది. ఇప్పుడు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతోంది. ఇక రీసెంట్ గా తమన్నా రెండు బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వంటి వెబ్ సిరీస్ లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన తమన్నా ఇప్పుడు తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన 'భోళాశంకర్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తమన్నా తాజాగా కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. ఇక ఆమె వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చారు. ఇక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం మెట్లు దిగి తన కోసం వచ్చిన అభిమానులకు హాయ్ చెబుతూ తమన్నా వెళ్తుండగా.. హఠాత్తుగా ఓ అభిమాని అక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దూకి తమన్నా చుట్టూ ఉన్న బౌన్సర్ల నుంచి తప్పించుకొని ఏకంగా తమన్నా చేయి పట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన బౌన్సర్లు అభిమానిని పక్కకు లాగేసారు. ఇక ఆ అభిమాని ఉత్సాహాన్ని గమనించిన తమన్నా తన బౌన్సర్లకు నచ్చచెప్పి అభిమాని కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. తర్వాత అతనితో ఓ సెల్ఫీ దిగి అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేవు. అయితే, అక్కడ ఉన్నవారు మాత్రం మిల్కీ బ్యూటీ చేసిన పనికి షాకయ్యారు. అతడి ప్రవర్తనకు ఆమె భయపడి, చెయ్యి విదిలించుకుంటుందని అనుకున్నారట అంతా. కానీ, ఆమె చాలా కూల్‌గా స్పందించడం చూసి ఆశ్చర్యపోయారు.
she is soo gorgeous 🥰 https://t.co/E2saelc72z
— Patient (@thinipadukovali) August 7, 2023
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అభిమాని పట్ల తమన్నా చేసిన పనిపై నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కింద నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్..' తమన్నా ఆ సిచువేషన్ ని హ్యాండిల్ చేసిన విధానం ఎంతో బాగుంది' అని కామెంట్ చేయగా మరో నెటీజన్.. 'తమన్నా హంబుల్ పర్సన్' అని, ఇంకో నెటిజన్.. 'తమన్నా ఎల్లప్పుడూ నా ఫేవరెట్' అంటూ రాసుకొచ్చారు. కాగా తమన్నా ప్రస్తుతం 'జైలర్', 'భోళా శంకర్' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. గత వారం రోజులుగా ఈ రెండు సినిమాలకు సంబంధించి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది.
ఈ ఇంటర్వ్యూల్లో ఆమెకు రకరకాల ప్రశ్నలు ఎదురవ్వగా.. వాటన్నింటికీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చింది. మరోవైపు ఇటీవల 'జైలర్' ఆడియో ఫంక్షన్ కి హాజరైన తమన్నా.. తాజాగా హైదరాబాదులో జరిగిన 'భోళాశంకర్' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం అటెండ్ అవ్వలేదు. ఆమె తోటి హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. అయితే తమన్నా 'భోళాశంకర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలియకపోయినా.. ఆమె రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు.
Also Read : వేసవికి 'పుష్ప 2' విడుదల డౌటే - అల్లు అర్జున్ & సుకుమార్ ఏం చేస్తారో?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial