అన్వేషించండి

Kalki 2898 AD: కల్కి సినిమా కలెక్షన్స్‌పై పెద్ద దెబ్బ! షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్

Tollywood News: కల్కి 2989 AD మూవీ బాహుబలి 2 సినిమా ఓపెనింగ్ రికార్డులను తిరగరాస్తుందని భావిస్తు్న్నారు. కానీ, టీ20 వరల్డ్ కప్ రూపంలో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు.

Kalki Movie Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బీ అమితాబ్, లోక నాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె లాంటి స్టార్ కాస్ట్ తో నిండిన సినిమా కల్కి 2898 AD కలెక్షన్లపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీలైతే బాహుబలి 2 లేదంటే కనీసం నాన్ బాహుబలి రికార్డ్స్ ను కొల్లగొట్టే సినిమా కల్కినే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అలాగే ఫస్ట్ డే కలెక్షన్ లలో కల్కీనే నెంబర్ వన్ గా నిలుస్తుందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారి ఆశలపై నీళ్ళు చల్లే పరిస్థితి ఎదురైంది.

కల్కి రిలీజ్ నాడే వరల్డ్ కప్ సెమీస్
కల్కి 2898 AD రిలీజ్ నాడే టీమ్ ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఇండియన్ టైం ప్రకారం రాత్రి 8 గంటల కు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే గ్రౌండ్ లో దిగిన ప్రతీ మ్యాచ్ లోనూ గెలుస్తూ టైటిల్ ఫేవరెట్ గా దూసుకు పోతుంది రోహిత్ సేన. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టునే ఇంటికి పంపిన భారత జట్టు తన నెక్స్ట్ టార్గెట్ ఇంగ్లాండ్ నే అంటుంది. ప్రపంచ కప్ సెమీస్ కావడం తో ఎక్కడెక్కడో ఉన్న భారత అభిమానులు అందరూ టీవీ లకు అతుక్కుపోవడం ఖాయం. అదే జరిగితే రాత్రి 8 గంటల నుండి మ్యాచ్ పూర్తయ్యే వరకూ బయటకు వచ్చే వారి సంఖ్య తక్కువే గానే ఉంటుంది. అదే కల్కి సినిమా అభిమానులను టెన్షన్ పెడుతోంది.

కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదా?
ప్రస్తుతం టాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ సినిమాలు రెండు ఉన్నాయి. సలార్, బాహుబలి - 2 సినిమాలు టాప్ 5 మూవీస్ లో ఉన్నాయి. కానీ నెంబర్ వన్ స్థానం మాత్రం రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించిన RRR దే. ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి తొలి రోజున రూ.74 కోట్ల షేర్ రాబట్టింది. ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా రూ.43 కోట్లతో బాహుబలి 2, మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రూ.38.88 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహ రెడ్డి" 38.75 కోట్ల షేర్ రాబట్టాయి. ఇప్పుడు కల్కితో ఈ రికార్డ్స్ అన్నీ రెబల్ స్టార్ బద్దలు కొడతాడనీ ఫిక్స్ అయిపోయారు డార్లింగ్ ఫ్యాన్స్. కానీ పులి మీద పుట్రలా టీ 20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ఎఫెక్ట్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ పై పడుతుందనే భయం కూడా వాళ్ళలో లేకపోలేదు.

ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కోసం వచ్చే సాయంత్రం షోస్ పై ఈ మ్యాచ్ ఎఫెక్ట్ పడుతుందేమో అన్న ఆందోళన ఒకపక్క ఉన్నా మరోవైపు  ఆన్లైన్ లో కల్కి సినిమా టికెట్లన్నీ బుక్ అయిపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊరటనిస్తుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మాతల చర్చలు ఫలించి కల్కికి ఏపీలో కూడా 6 ఆటలకు అనుమతి వచ్చింది. పైగా టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం కలగడంతో కచ్చితంగా కల్కి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ను డార్లింగ్ ప్రభాస్ కొల్లగొడతాడనే నమ్మకంతో ఉన్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA Final T20 2024: ఫైనల్ పోరులో ఆదుకున్న కోహ్లీ, రాణించిన అక్షర్ పటేల్- సఫారీల ముందు మోస్తరు టార్గెట్
ఫైనల్ పోరులో ఆదుకున్న కోహ్లీ, రాణించిన అక్షర్ పటేల్- సఫారీల ముందు మోస్తరు టార్గెట్
Andhra Congress Politics : వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజుకు ఏపీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు - జూలై 8న విజయవాడకు సోనియా, రాహుల్ ?
వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజుకు ఏపీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు - జూలై 8న విజయవాడకు సోనియా, రాహుల్ ?
CM Revanth Reddy: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి, 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి, 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Vijay Devarakonda: ‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్
‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

South Africa vs India T20 World Cup Final Weather | T20WC ఫైనల్ లో వరుణుడు అడ్డుపడితే పరిస్థితి ఏంటీRohit Sharma only Player 1St T20 World Cup and Now | చరిత్రలో ఆ ఒక్కడిగా నిలిచిన రోహిత్ శర్మ | ABPSouth Africa vs India T20 World Cup Final | ప్రపంచకప్ తుది సమరానికి భారత్, దక్షిణాఫ్రికా సిద్ధం |ABPRohit Sharma T20 World Cup 2024 Final | వరల్డ్ కప్ లో ఫైనల్ రోహిత్ రెచ్చిపోవాలంటున్న ఫ్యాన్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA Final T20 2024: ఫైనల్ పోరులో ఆదుకున్న కోహ్లీ, రాణించిన అక్షర్ పటేల్- సఫారీల ముందు మోస్తరు టార్గెట్
ఫైనల్ పోరులో ఆదుకున్న కోహ్లీ, రాణించిన అక్షర్ పటేల్- సఫారీల ముందు మోస్తరు టార్గెట్
Andhra Congress Politics : వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజుకు ఏపీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు - జూలై 8న విజయవాడకు సోనియా, రాహుల్ ?
వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజుకు ఏపీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు - జూలై 8న విజయవాడకు సోనియా, రాహుల్ ?
CM Revanth Reddy: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి, 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి, 2050 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Vijay Devarakonda: ‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్
‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
టీ 20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ వందకోట్లు- ఆడిన ప్రతీ జట్టుపై కోట్ల వర్షం
Andhra Pradesh: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు, ఏపీలో పోలవరం విధ్వంసానికి వాళ్లే కారకులు - వైఎస్ షర్మిల ఫైర్
Andhra Pradesh: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు, ఏపీలో పోలవరం విధ్వంసానికి వాళ్లే కారకులు - వైఎస్ షర్మిల ఫైర్
Ind Vs Sa final: కుప్పకూలిన టీమిండియా టాపార్డర్‌, ఇక భారమంతా కింగ్‌ కోహ్లీపైనే
కుప్పకూలిన టీమిండియా టాపార్డర్‌, ఇక భారమంతా కింగ్‌ కోహ్లీపైనే
Anasuya Bharadwaj: తగ్గేదేలే.. మళ్లీ కోటు విప్పేసిన అనసూయ - ఈ సారి ఫొటోషూట్ కోసం, ఆ ఫొటోలు మీరూ చూసేయండి
తగ్గేదేలే.. మళ్లీ కోటు విప్పేసిన అనసూయ - ఈ సారి ఫొటోషూట్ కోసం, ఆ ఫొటోలు మీరూ చూసేయండి
Embed widget