అన్వేషించండి

Kanguva Glimpse: సూర్య 'కంగువ' గ్లిమ్స్ వచ్చేస్తుంది - ఎప్పుడంటే?

శివ దర్శకత్వంలో తమిళ అగ్ర హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కంగువ'. కాగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ డేట్ రివీల్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ని విడుదల చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. అత్యంత భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా గ్లిమ్స్ వీడియో రాబోతుందంటూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ గ్లిమ్స్ వీడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేందుకు ఒక్కో పోస్టర్తో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఓ పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్లో సూర్య ముఖాన్ని చూపించకుండా చేతిలో కత్తి పట్టుకున్న యుద్ధ వీరుడుగా పోస్టర్ డిజైన్ చేశారు. అంతేకాకుండా 'ప్రతి భయం వెనక ఓ కథ దాగి ఉంది. కింగ్ వచ్చేస్తున్నాడు' అంటూ స్టూడియో గ్రీన్ సంస్థ ట్వీట్ చేయగా.. తాజాగా  మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ జూలై 23న 'కంగువ' గ్లిమ్స్ రాబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లో 'ది మ్యాన్, ది వైల్డ్, ది స్టోరీ' అని పేర్కొంటూ  సూర్య ముఖాన్ని చూపించకుండా గుర్రంపై యుద్ధ వీరుడి గెటప్ లో ఉన్న సూర్య వెనుక భాగాన్ని చూపించారు. ఈ పోస్టర్లో సూర్య పొడవైన జుట్టుతో చాలా విభిన్నంగా కనిపిస్తున్నారు. ఇలా ఒక్కో పోస్టర్తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు మూవీ యూనిట్. ఇక ఈ అప్డేట్ తో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

అలాగే తాజాగా విడుదలైన 'కంగువ' పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో సూర్య మొత్తం ఐదు విభిన్న తరహా గెటప్స్ లో కనిపించనున్నారట. సినిమాలో సూర్యకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. కోవై సరళ, యోగిబాబు, బీ ఎస్ అవినాష్, రెడీన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఉండబోతోంది. కేవలం 2D ఫార్మేట్ లోనే కాకుండా 3D లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తమిళ, తెలుగు, హిందీ సహా మొత్తం పది భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అంతే కాదు పలు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓవైపు షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఎంతో గ్రాండియర్ గా ఈ సినిమా రూపొందుతోంది. మరి సూర్య కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atu Friend Itu Lover: ట్రెండీ కాన్సెప్ట్‌తో చిన్న సినిమా... ఫ్రెండ్, లవర్ మధ్యలో?
ట్రెండీ కాన్సెప్ట్‌తో చిన్న సినిమా... ఫ్రెండ్, లవర్ మధ్యలో?
Varun Tej: ప్రాక్టీస్ 'బరి'లో మెగా హీరోకి గాయాలు... అపోలో ఆస్పత్రిలో సర్జరీ
ప్రాక్టీస్ 'బరి'లో మెగా హీరోకి గాయాలు... అపోలో ఆస్పత్రిలో సర్జరీ
Varanasi Update : వారణాసిలో అండర్ వాటర్ సీక్వెన్స్ - ఎన్టీఆర్ దేవర సెట్స్‌లో జక్కన్న టీం?... అసలు రీజన్ ఏంటంటే?
వారణాసిలో అండర్ వాటర్ సీక్వెన్స్ - ఎన్టీఆర్ దేవర సెట్స్‌లో జక్కన్న టీం?... అసలు రీజన్ ఏంటంటే?
Mrunal Thakur: మళ్ళీ బికినీలో మృణాల్... బాలీవుడ్‌లో అంతే అంతే!
మళ్ళీ బికినీలో మృణాల్... బాలీవుడ్‌లో అంతే అంతే!

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ఇవే
Jagan CPRO Pudi Srihari Arrest: మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్.. ఏ కేసులో అంటే!
AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే
Beat the Heat : రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజురోజుకీ పెరుగుతోన్న ఎండ తీవ్రత.. డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా పెద్దలు, పిల్లలు ఈ జాగ్రత్తలు తీసుకోండి
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ - ఒకే రోజున ఎన్ని సర్ప్రైజెస్ తెలుసా?
Sambhavam Adhyayam Onnu OTT : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Embed widget