Superstar Singer 3: ఏడేళ్లకే ‘సూపర్ స్టార్ సింగర్’ టైటిల్ కొట్టిన లిటిల్ సింగర్ - అక్కే అన్నీ అంటున్న ఆవిర్భవ్
Superstar Singer 3: ఏడేళ్లకే ‘సూపర్ స్టార్ సింగర్ 3’ టైటిల్ కొట్టాడు ఆవిర్భవ్. సీనియర్ సింగర్లతో పాటు ఆడియన్స్ మనసు కూడా గెలుచుకున్నాడు. ట్రోఫీ గెలిచిన తర్వాత తన అనుభవాలను అందరితో పంచుకున్నాడు.
Superstar Singer 3 Winner Avirbhav S: టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ఇది నిజమే అని నిరూపించేలా ఇప్పటికే ఎంతోమంది లిటిల్ ఛాంపియన్స్ పలు రంగాల్లో తమ సత్తాను చాటుకున్నారు. తాజాగా ఒక లిటిల్ సింగర్.. సూపర్ స్టార్ సింగర్ స్టేజ్ ఎక్కి తన పాటలతో అందరినీ మైమరిపించి టైటిల్ గెలిచాడు ఆవిర్భవ్ ఎస్. తనతో పాటు ఈ ట్రోఫీని పంచుకున్న మరో లిటిల్ సింగర్ అథర్వ్ బాక్షి. ప్రస్తుతం ఈ ఇద్దరు పాడిన పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మలయాళీ అయిన ఆవిర్బవ్ వాయిస్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆవిర్భవ్ మాత్రమే కాదు.. తన అక్క అనిర్ విన్హ్య కూడా సింగరే. వీరిద్దరూ కలిసి పలు తెలుగు పాటలు కూడా పాడడం విశేషం.
అక్కే కారణం..
సోనీ టీవీలో టెలికాస్ట్ అయ్యే ‘సూపర్ స్టార్ సింగర్’ షో తాజాగా మూడో సీజన్ పూర్తి చేసుకుంది. గత శనివారం ఈ షో ఫైనల్ రేస్ జరిగింది. ఇందులో ఆవిర్భవ్, అథర్వ్ ఇద్దరూ విన్నర్స్‌గా నిలిచి.. రూ.10 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. షో తర్వాత మీడియాతో, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు ఆవిర్భవ్. తర్వాత తన ప్లాన్స్ ఏంటి అని అడగగా.. ‘‘కీబోర్డ్‌తో హిందుస్తానీ సంగీతం నేర్చుకుంటాను. దాని తర్వాత అన్ని సంగీత వాయిద్యాలు నేర్చుకుంటాను. రోజూ స్కూల్‌కు వెళ్తాను. స్కూల్ నుంచి వచ్చాక సంగీతం మీద ఫోకస్ చేస్తాను’’ అన్నాడు ఆవిర్భవ్. ఇక సంగీతంపై తనకు వచ్చిన ఇంట్రెస్ట్‌కు తన అక్కే కారణమని పూర్తిగా తనకే క్రెడిట్ ఇచ్చేశాడు.
View this post on Instagram
వారి సినిమాల్లో పాడతాను..
‘‘నేను సూపర్ స్టార్ సింగర్ 3 ట్రోఫీ గెలిచిన తర్వాత నా కుటుంబంలోని అందరూ నన్ను హత్తుకున్నారు. వాళ్లంతా చాలా సంతోషపడ్డారు. మా అక్కే నాకు సంగీతం నేర్పించింది’’ అని అన్నాడు ఆవిర్భవ్. ఇక షో గురించి మాట్లాడుతూ.. ‘‘నేహా కక్కర్ లేచి నా పర్ఫార్మెన్స్‌కు చప్పట్లు కొట్టారు. నేను పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతానని ఉదిత్ నారాయణ్ అన్నారు. నేను బ్రీత్‌లెస్ పాట పాడినందుకు జాకీ ఖాన్ నన్ను ఎత్తుకున్నారు’’ అని తనకు గుర్తుండిపోయే జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చాడు ఆవిర్భవ్. తను పెద్దయ్యాక పెద్ద సింగర్ అయ్యి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోలకు పాటలు పాడాలని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు. సూపర్ స్టార్ సింగర్ 3 ట్రోఫీ గెలిచిన ఆవిర్భవ్‌కు వయసు ఏడేళ్ల అవ్వడం విశేషం.
View this post on Instagram
Also Read: తమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?