Paarijatha Parvam Trailer: ‘పారిజాత పర్వం’ ట్రైలర్ విడుదల - సునీల్ చేసే కిడ్నాప్ సక్సెస్ అవుతుందా?
Paarijatha Parvam: సునీల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘పారిజాత పర్వం’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. క్రైమ్ కామెడీ జోనర్‌లో కిడ్నాప్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని అర్థమవుతోంది.
Paarijatha Parvam Trailer Out Now: క్రైమ్ కామెడీ చిత్రాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా మారిపోతున్నాయి. ఒక క్రైమ్ కథను తీసుకొని అందులో ప్రేక్షకులకు నచ్చే విధంగా కామెడీ యాడ్ చేస్తే వారు కచ్చితంగా సినిమా చూస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ఇక అదే తోవలో త్వరలోనే మరో తెలుగు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇందులో ప్రతీ పాత్రకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుందని ‘పారిజాత పర్వం’ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. పైగా ‘కిడ్నాప్ ఒక ఆర్ట్’ అంటూ మూవీ ట్యాగ్ లైన్‌ను కూడా ఇంట్రెస్టింగ్‌గా పెట్టారు మేకర్స్.
వైవా హర్ష కామెడీ..
‘‘కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆపుతారట. మళ్లీ లైట్స్ వేసేలోపు కేక్‌తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’’ అంటూ సునీల్ చెప్పే డైలాగ్‌తో ‘పారిజాత పర్వం’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీంతో మొదటి డైలాగ్‌తోనే ఇది ఒక కిడ్నాప్‌కు సంబంధించిన కథ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ట్రైలర్‌లో సునీల్ క్యారెక్టర్, తను చెప్పే డైలాగ్సే హైలెట్‌గా నిలిచాయి. ‘‘నాకు డబ్బులు వద్దు నీ పనిమనిషి కావాలి’’ అంటూ సునీల్ చెప్పే డైలాగ్.. ఈ మూవీలో కామెడీ కంటెంట్ ఎలా ఉంటుందో అని శాంపుల్ చూపించింది. ఈ మూవీలో సునీల్ ఒక కిడ్నాపర్‌గా కనిపించగా.. ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్న చైతన్య రావు, వైవా హర్షల క్యారెక్టర్స్ గురించి ట్రైలర్‌లో క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటేయిన్ చేశాడు దర్శకుడు సంతోష్.
రెండు కిడ్నాప్స్..
‘పారిజాత పర్వం’ అనేది ఒకటి కాదు.. రెండు కిడ్నాప్స్‌పై ఆధారపడిన సినిమా అని ట్రైలర్‌లో తెలిపారు. కానీ ఇందులో కాస్త కన్‌ఫ్యూజన్‌ను యాడ్ చేసి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యర్ ఓ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. వైవా హర్షతో పాటు రోహిని కూడా ఈ సినిమాలో కామెడీతో అందరినీ నవ్వించనుందని తెలుస్తోంది. ఇక ‘పారిజాత పర్వం’ ట్రైలర్ చివర్లో వైవా హర్ష ఇచ్చే అరనిమిషం మూవీ రివ్యూ.. ఎవరినో ఇన్‌డైరెక్ట్‌గా ట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీంతో మూవీలో తన కామెడీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థమవుతుంది.
కిడ్నాప్ సాంగ్..
ఇప్పటికే ‘పారిజాత పర్వం’ నుంచి విడుదలయిన కాన్సెప్ట్ టీజర్, టీజర్‌లో కూడా కిడ్నాప్ గురించే హైలెట్ చేసి చూపించారు మేకర్స్. ఇక ఇందులో శ్రద్ధా దాస్, మాళవికా సతీషన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ట్రైలర్‌లో వారి పాత్రల గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు. ‘పారిజాత పర్వం’లో శ్రద్ధా దాస్.. ‘రంగ్ రంగ్ రంగీలా’ అనే ఐటెమ్ పాటకు స్టెప్పులు వేయడంతో పాటు తానే స్వయంగా పాడింది కూడా. ఏప్రిల్ 19న ఈ క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
Also Read: ఓటీటీకి రాబోతున్న బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!