Ooru Peru Bhairavakona OTT Partner: 'ఊరు పేరు భైరవకోన' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే? - స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Ooru Peru Bhairavakona OTT: అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది 'ఊరు పేరు భైరవకోన' చిత్రం. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
![Ooru Peru Bhairavakona OTT Partner: 'ఊరు పేరు భైరవకోన' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే? - స్ట్రీమింగ్ ఎప్పుడంటే.! Sundeep Kishan Ooru Peru Bhairavakona OTT Partner and Streaming At to Decide Ooru Peru Bhairavakona OTT Partner: 'ఊరు పేరు భైరవకోన' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే? - స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/0c6f905e48d37bef199c60750e0044361708072289558929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ooru Peru Bhairavakona OTT Details: అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది 'ఊరు పేరు భైరవకోన' చిత్రం. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం, అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే హిట్‌టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో మూవీ రిజల్ట్ తేలిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మేకర్స్ అంతా రిలాక్స్ అయ్యారు. హార్రర్ ఫాంటసీ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ అందుకుంటుంది. కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్‌కు ఈ చిత్రంతో భారీ హిట్ పక్కా అంటున్నారు సినిమా చూసిన ఆడియన్స్.
పోటీ పడుతున్న ఓటీటీ సంస్థలు?
రిలీజ్‌కు ముందు ఈ చిత్రానికి లీగల్ అడ్డంకులు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా కూడా సందీప్ కిషన్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా బాగానే వచ్చాయని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఇక థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా అయినా డిజిటల్ స్ట్రీమింగ్ వస్తుందనే విషయం తెలిసిందే. దీంతో ఇలా మూవీ బిగ్‌స్క్రీన్‌కి వచ్చిందో లేదో వెంటనే ఓటీటీ పార్ట్‌నర్, రిలీజ్ డేట్‌పై కన్నెస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో 'ఊరు పేరు భైరవకోన' మూవీ ఓటీటీ పార్ట్‌నర్, రైట్స్ ఆసక్తిగా మారాయి.కానీ, ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఏంటన్నది తేలకపోవడం గమనార్హం. నిజానికి మూవీ రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ అయిపోతుంది. కానీ ఈ చిత్రాన్ని లీగల్ సమసయలు వెంటాడటంతో డిజిటల్ సంస్థ ముందుగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ తెచ్చుకున్న ఈ సినిమాకు కోసం ఇప్పుడు పలు ఓటీటీ సంస్థలు ఎగబడుతున్నాయట. ప్రస్తుతం దీనిపై మేకర్స్‌తో చర్చలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో మేకర్స్‌కు భారీ డీల్‌ను ఆఫర్ చేస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అప్పుడే ఓటీటీకి..
ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఊరు పేరు భైరవకోనను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకునేందుకు మేకర్స్ ముందు ఫ్యాన్సీ ధర పలుకుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ, త్వరలోనే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్, స్ట్రిమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏ మూవీ అయినా థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనేది ఒప్పందం. అయితే అది మూవీ రిజల్ట్ బట్టి డిసైడ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. చూస్తుంటే ఊరు పేరు భైరవకోన భారీ హిట్ కొట్టేలాగే ఉంది. కాబట్టి ఈ సినిమా థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలలు లేదా 45 రోజుల తర్వాత ఓటీటీ వచ్చే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే 'ఊరు పేరు భైరవకోన' ఎప్రిల్ రెండో వారం లేదా మార్చి చివరిలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయ్యాక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Also Read: ఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?
నిజానికి సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. కానీ అప్పటికే పలు హైప్ ఉన్న సినిమాలు రేసులో ఉండడంతో ఈ మూవీ సైలెంట్‌గా తప్పుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంది. కానీ ‘ఈగల్’కు సోలో రిలీజ్ అందించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రిక్వెస్ట్ చేయడంతో ఆ డేట్ నుండి కూడా తప్పుకుంది. చివరకు ఫిబ్రవరి 16న ‘ఊరి పేరు భైరవకోన’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుని సోలోగా వచ్చింది. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రంలో ‘ఊరు పేరు భైరవకోన’. జోంబి తరహా యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఊరు పేరు భైరవకోన సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌తోపాటు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, పీ రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)