అన్వేషించండి

Chiranjeevi: రీల్‌పైనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ విలన్ల నుంచి హీరోయిన్‌ని కాపాడిన మెగాస్టార్‌ - వీడియో వైరల్‌

Chiranjeevi: ఇక రీల్‌పై హీరోగా హీరోయిన్లను విలన్‌ నుంచి కాపాడినట్టు ఎన్నో సినిమాల్లో చూశాం. రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోను చిరు హీరోయిన్‌ని విలన్ల నుంచి కాపాడారనే విషయం తెలుసా?.  

Suhasini Says Chiranjeevi is Real Hero: టాలీవుడ్‌ ఇండస్ట్రీకి మెగాస్టార్‌ చిరంజీవికి 'గాడ్‌ఫాదర్‌' లాంటి వారు. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చామంటూ ఈతరం హీరోలంతా చెబుతుంటారు. హీరోగా టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్స్ అందించారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేష సేవలకుగానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే రెండవ అత్యన్నత పురస్కారం ఆయన దక్కడంతో ఫ్యాన్స్, ఇండస్ట్రీవర్గాలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రీల్‌పై హీరోగా హీరోయిన్లను విలన్‌ నుంచి కాపాడినట్టు ఎన్నో సినిమాల్లో చూశాం. రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోను చిరు హీరోయిన్‌ని విలన్ల నుంచి కాపాడారనే విషయం తెలుసా?.  

ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరోయినే వెల్లడించింది. చిరంజీవి, నటి సుహాసిని వెండితెరపై జంటగా ఎన్నో సినిమాల్లో అలరించారు. అయితే లాక్‌డౌన్‌ టైంలో ఇంటికే పరిమితమైన సుహాసిని తరచూ సోషల్‌ మీడియాలో వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన సంగతి తెలిసిందే. తరచూ లైవ్‌ చాట్‌కు వచ్చి ఆసక్తికర విషయాలను పంచుకునేంది. ఈ క్రమంలో ఓ రోజు లైవ్‌ చాట్‌లో నిర్వహిస్తుండగా చిరంజీవి ఆమెకు వీడియో కాల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. అదే సమయంలో తన రియల్‌ లైఫ్ లో జరిగిన రీల్‌ ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకున్నారామె. ఈ వీడియోలో సుహాసిని మాట్లాడుతూ.. ఓ మూవీ షూటింగ్‌ తర్వాత కొందరు ఆకతాయిలు మాపై దాడి చేస్తుంటే మీరు అడ్డుకున్నారు గుర్తుందా? అని  చిరుతో అన్నారు. 

‘కేరళలోని అథిరపల్లిలో షూటింగ్ చేస్తున్నాం. మీరు ముందు కారులో ఉన్నారు. నేను, నా హెయిర్ డ్రెస్సర్, డాన్స్ మాస్టర్ తార వెనక కారులో వస్తున్నాం. అదే సమయంలో కొందరు తాగుబోతులు మా కారును అడ్డుకున్నారు. మేము కారు దిగి వారిని వారిస్తుంటే బీరు బాటిళ్లు మాపైకి విసిరారు. అప్పుడు మీరు ఏం చేశారో గుర్తుందా?’ అని లైవ్‌లో చిరంజీవిని సుహాసిని అడిగారు. ‘నేను నా పిస్టల్ బయటికి తీశాను’ అని చిరంజీవి చెప్పారు. అది లైసెన్సెడ్ గన్ అని సుహాసిని అన్నారు. తాగుబోతులు సుహాసిని కారుపైకి బీరు బాటిళ్లు విసరడంతో చిరంజీవి వెంటనే గన్ తీసి వారిని బెదిరించారట. దాంతో వెంటనే మూవీ యూనిట్ బాయ్స్ కూడా సంఘటన స్థలానికి వచ్చి తాగుబోతులను చితక్కొట్టారట. 

Also Read: ఫస్ట్‌డే భారీ వసూళ్లతో సర్‌ప్రైజ్‌ చేసిన 'ఊరు పేరు భైరవకోన'- సందీప్‌ కిషన్‌ కెరీర్‌లోనే హయ్యేస్ట్‌ గ్రాస్‌ మూవీ

ఈ విషయాన్ని చిరంజీవి చెప్పగానే.. సుహాసిని మాట్లాడుతూ 'హీరోయిజం అంటే కెమెరా ముందు చేసేది మాత్రమే కాదు. రియల్ లైఫ్‌లో కూడా మీరు హీరో. ఈ విషయాన్ని ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నా' అంటూ మెగాస్టార్ ని రియల్‌ హీరో అంటూ పొగిడింది. చిరుకు 'పద్మవిభూషణ్‌' వచ్చినందుకు ఆయనకు అమెరికాలో సన్మానం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్‌ ఈ పాత వీడియోను వైరల్‌ చేస్తున్నారు. ఇది చూసిన కొందరు 'అవును.. చిరంజీవి రీల్‌ లైఫ్ హీరోనే కాదు రియల్‌ లైఫ్‌ హీరో కూడా' అంటూ కేజీయఫ్‌ సీన్‌ను గుర్తు చేస్తున్నారు. కేజీయఫ్‌ సీన్‌ ఫస్ట్‌ ఇక్కడ క్రియేట్‌ అయ్యిందంటూ కామెంట్స చేస్తున్నారు. కాగా కేజీయఫ్‌ చాప్టర్‌ వన్‌లో హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌లో కొందరు ఆకతాయిలు ఆమెపై బీరు బాటిళ్లు విసురుతుండటంతో హీరో వచ్చి గన్‌తో వారిని బెదిరించిన సంగతి తెలిసిందే. 

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget