Suhas: తమిళంలో విలన్.. టాలీవుడ్‌లో హీరో? - డిఫరెంట్ లుక్‌లో సుహాస్
Mandaadi Movie: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ 'మండాడి' మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చేస్తుండగా.. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Suhas's Madaadi First Look Unvieled: ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తనదైన నటనతో ఆడియన్స్ మదిలో స్టార్‌గా ఎదిగారు సుహాస్ (Suhas). షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన.. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా ఎదిగారు. ఇదే జోష్‌తో ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
కోలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ
కోలీవుడ్‌లో 'మండాడి' (Mandaadi) చిత్రంలో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు సుహాస్. ఈ సినిమాతోనే తమిళ కమెడియన్ సూరి (Soori) హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా.. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. నెరిసిన జుట్టు, గుబురు గెడ్డం, లుంగీ ధరించి జెర్సీ వేసుకుని 'సునామీ రైడర్స్' బృందంతో సముద్ర తీరంలో ఉన్న సుహాస్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ చెరొక పడవ నడుపుతూ కోపంగా కనిపించడం ఆసక్తి రేపుతోంది. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే హైప్ నెలకొంది.
Here is the first look of #Mandaadi
— Suhas 📸 (@ActorSuhas) May 5, 2025
Can't wait to ride and rule the sea with @sooriofficial Anna 🤗🌊@elredkumar @rsinfotainment #VetriMaaran @MathiMaaran @gvprakash @Mahima_Nambiar #Achyuthkumar @RavindraVijay1 #Sathyaraj pic.twitter.com/ZLUSKisaHe
ఈ మూవీకి 'సెల్ఫీ' ఫేం మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా.. సుహాస్‌తో పాటు సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16 ప్రాజెక్టుగా 'మండాడి' నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం వహిస్తున్నారు. సినిమాలో సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అక్కడ విలన్.. ఇక్కడ హీరో
అయితే.. ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుండగా.. తమిళంలో సూరి హీరో.. విలన్‌గా సుహాస్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలుగులో రోల్స్ చేంజ్ కానున్నాయి. తెలుగులో హీరోగా సుహాస్.. విలన్‌గా సూరి నటించనున్నారట. అయితే, మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇలా ప్రతీ సీన్ రెండు వెర్షన్లలో తీస్తారన్నమాట.
#Mandaadi 💥🔥
— Christopher Kanagaraj (@Chrissuccess) May 5, 2025
Soori Hero & Suhas Villain - Tamil
Suhas Hero & Soori Villain - Telugu pic.twitter.com/wQu9GJIHHU
'కలర్ ఫోటో' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుహాస్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మజిలి, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అడవిశేష్ 'హిట్ 2' మూవీలో విలన్‌గా ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామ' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనే మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.






















