(Source: Poll of Polls)
Suhas Production No.4: సుహాస్ ప్రొడక్షన్ నెం.4 మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన టీం - మరీ టైటిల్ ఎప్పుడు ?
Suhas Next Movie: ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కానీ సుహాస్ మూవీ ప్రొడక్షన్ నెం.4 రిలీజ్ డేట్ ప్రకటించింది మూవీ టీం. సమ్మర్ కానుక ఈ సినిమా థియేటర్లో విడుదల చేస్తామంటూ ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు.

Suhas Production no. 4 Release Date: రోజురోజుకు హీరో సుహాస్ సినిమాలకు ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. అతడి పేరు వినిపిస్తే చాలు ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ కొట్టిన సుహాస్ అప్పుడే పలు కొత్త సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇటివలె 'ప్రసన్న వదనం' అనే సినిమాను ప్రకటించిన సుహాస్ ప్రస్తుతం దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రోడక్షన్ నెం.4 పేరుతో మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చారు.
గత డిసెంబర్‌లో లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించగా ఇప్పటి వరకు టైటిల్‌ను ఫైనల్ చేయకపోవడం గమనార్హం. అయితే ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించి మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 24న మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని పెంచుతుంది. న్యాయదేవత స్థానంలో చిన్న పాప ఫోటోతో ఉంది. చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని ఒక చేతిలో రెండు ట్రే స్కేల్ పట్టుకొని కనిపించింది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఒక ఫన్నీ కోర్టు డ్రామా అని అర్థమవుతుంది. #JAGonMay24 అనే హ్యాష్ ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
View this post on Instagram
త్వరలోనే టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ఆకాశం దాటి వస్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవల ఈ బ్యానర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధమవుతుంది. త్వరలోనే మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో సుహాస్ జతగా సంకీర్తన విపిన్ నటిస్తుంది. నిర్మాత శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా వర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.





















