అన్వేషించండి

Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫస్ట్ లుక్ అదుర్స్ - మరో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సుహాస్

హీరో సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ప్రస్తుతం ఈ పోస్టర్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Suhas: టాలీవుడ్ లో ప్రతి ఏటా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే సినిమా రంగంలో నిలదొక్కుకోగలుగుతారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అయిన హీరోలు చాలా మందే ఉన్నారు. అలా సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగారు సుహాస్. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించారు. పలు సినిమాల్లో హీరోకు ఫ్రెండ్ పాత్రల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘కలర్ ఫోటో’ సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ప్రస్తుతం ఈ పోస్టర్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ సినిమా తెరకెక్కింది. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. దుశ్యంత్ కటికనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ లో సుహాస్ అండ్ టీమ్ డప్పులను పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయి తో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. వెనక మల్లిఖార్జున సెలూన్ షాప్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో సుహాస్ మల్లి అనే మ్యారేజ్ బ్యాండ్ సభ్యుడిలాగా కనిపించనున్నారని టాక్. పోస్టర్ ఆకట్టుకునేలా ఉండటంతో మూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి. 

ఇక షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలుపెట్టి ‘కలర్ ఫోటో’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు సుహాస్. ‘ఫ్యామిలీ డ్రామా’, ‘హిట్ 2’ వంటి థ్రిల్లర్ చిత్రాల్లోనూ నటించారు. ‘హిట్ 2’ సినిమాలో మెయిన్ విలన్ గా సినిమా చివరి పదినిమిషాల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు సుహాస్. ఇవే కాకుండా రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్. ఈ సినిమాతో ఆయనకు లేడీ ఫ్యాన్ బేస్ కూడా పెరిగిందనే చెప్పాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని జోనర్ లను టచ్ చేస్తూ  పకడ్బంధీగా కెరీర్ ను ప్లాన్ చేస్తూ వస్తున్నారు సుహాస్. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. అందులో భాగంగానే ప్రమోషన్స్ పనులను మొదలు పెట్టారు చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్ లను త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్. ో

Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget