అన్వేషించండి

Sudhakar Komakula: యాక్సిడెంట్‌తో నటుడిగా మారిన సుధాకర్‌ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు ఇవే!  

"లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్‌ చిత్రంతో ప్రేక్షుకుల మనసు గెలుచుకున్న సుధాకర్ కోమాకుల, నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా టాలెంట్‌ నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఇసకపట్నంతో ఇరగదీసేందుకు సిద్ధమవుతున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రమాదం తర్వాత నటుడిగా మారిన సుధాకర్, ఐటీ ఉద్యోగం చేస్తూ అవకాశాలకై ప్రయత్నించారు.
  • లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నాగరాజ్ పాత్రతో సుధాకర్ విశేష గుర్తింపు పొందారు.
  • నువ్వు తోపురా సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా, గాయకుడిగా ప్రశంసలందుకున్నారు.
  • సుఖ మీడియా పేరుతో నిర్మాతగా మారిన సుధాకర్, పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు రూపొందించారు.

Sudhakar Komakula: తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సుధాకర్ కోమాకుల. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఒక వెలుగు వెలిగిన సుధాకర్, గత దశాబ్ద కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే తన పంథాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కేవలం నటనకే పరిమితం కాకుండా, సినిమా నిర్మాణంలో సాంకేతిక మెళకువలను అందిపుచ్చుకొని రాణించే ప్రయత్నంలో ఉన్నాడు. 

ప్రమాదం కారణంగా నటుడిగా మారిన సుధాకర్

సుధాకర్ కోమాకుల 1989లో విశాఖ పట్నంలో జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయనకు కళల పట్ల, ముఖ్యంగా డ్యాన్స్, నటన పట్ల ఇష్టం ఏర్పడింది. ఆయన తండ్రి కారణంగానే రంగస్థలంపై మక్కువ పెరిగింది. విశాఖలో ఒక డ్యాన్స్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటూ వచ్చిన సుధాకర్ డ్యాన్స్ మాస్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ డిప్లొమా ఇన్ కొరియోగ్రఫీ కోర్సు చేశాడు. అయితే ఒక ప్రమాదం ఆయన జీవితాన్ని మార్చేసింది. ప్రమాదంలో తగిలిన గాయాలు కారణంగా డ్యాన్స్ మాస్టర్ అవుదామనే కలకు గుడ్‌బై చెప్పేశాడు. తన సెకండ్ ప్రయార్టీ లిస్ట్‌లో ఉన్న నటనవైపు వచ్చాడు. 

Also Read: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

అనుకున్నట్టుగానే సినిమాల్లో పాత్రలు వచ్చేస్తే కిక్ ఏం ఉంటుంది. అందుకే ఫొటోలు పట్టుకొని పది ఆఫీస్‌లు తిరగాల్సి వచ్చింది. ఇంతలో బతకడానికి హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. పగటి పూట ఆఫీసులకు వెళ్లి ఆడిషన్లు ఇవ్వడం, రాత్రి షిప్టుల్లో ఆఫీస్‌లో పని చేస్తూ వచ్చాడు. 2002లో మనసుతో చిత్రంలో చిన్న పాత్ర లభించింది. 2006లో ఒక విచిత్రంలో సహాయ నటుడిగా కనిపించినప్పటికీ అనుకున్న బ్రేక్ రాలేదు. 

Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో

నాగరాజ్ పాత్రతో సంచలనం 

2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌ సుధాకర్ కెరీర్‌ అతి పెద్ద మలుపు. ఇందులో ఆయన పోషించిన నాగరాజ్‌ పాత్ర, తెలంగాణ యాసలో సాగే సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాస్తవికమైన నటనతో ఆయన తెలుగులోని చాలా ఇళ్లల్లో నాగరాజ్‌గానే గుర్తుండిపోయాడు. ఈ చిత్రం థియేటర్‌లలో యావరేజ్‌గా ఆడినా ఆన్‌లైన్, టీవీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతోంది.

అంతర్జాతీయ వేదికపై "నువ్వ తోపురా"

సుధాకర్ నటించిన "నువ్వు తోపురా" సినిమా ఆయన కెరీర్‌లోనే మైలురాయి. ఈ చిత్రం 70 శాతం అమెరికాలోని ఉటాలో చిత్రీకరించారు. ఒక అక్రమ వలసదారుడు అమెరికాలో ఎదుర్కొనే సవాళ్లను వాస్తవికంగా చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

Also Read: విరోష్ కపుల్ గ్లోబల్ ట్రెండింగ్ - నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ పోస్ట్ ఏంటంటే?

ఈ చిత్రానికి సుధాకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2020 ఉటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో మేడ్ ఇన్ ఊటా కేటగిరిలో బెస్ట‌పిక్చర్ అవార్డు గెలుచుకుంది. హాలీవుడ్ జ్యూరీ సభ్యులు సుధాకర్‌ నటనను, చిత్ర నిర్మాణ విలువలను ప్రశంసించారు. ఈ సినిమాతోనే ఆయన గాయకుడిగా కూడా మారి ఒగ్గు కథ, పోరీలంటే బిపి షుగర్ లాంటి పాటలు పాడారు. 

నిర్మాతగా ప్రయాణం ప్రారంభం 

కేవలం అవకాశాల కోసం వేచి చూడకుండా తన భార్య హారికతో కలిసి సుఖ మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సుధాకర్ నిర్మాతగా మారారు. దీని ద్వారా వినూత్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

Also Read: iBOMMA ఓపెన్ చేస్తున్నారా - ఇది మీ కోసమే!

సుఖ మీడియా నిర్మాణంలోనే నారాయణ అండ్ కో సినిమాను 2023లో విడుదల చేశాడు. క్రైమ్ కామెడీ చిత్రానికి అమెజాన్‌లో మంచి లభించింది. జీడీ పేరుతో దేశంలోనే మొదటి ఫౌండ్ ఫుటేజ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ తీశారు. ఒక కారులో ఆరుగురు స్నేహితులు ప్రయాణం చుట్టూ తిరిగే ప్రయోగాత్మక చిత్రం త్వరలో విడుదల కానుంది. 

2026లో ప్రైమ్ వీడియో కోసం రూపొందుతున్న ఇసకపట్నం సిరీస్‌లో సుధాకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో ఐశ్వర్య రాజేష్‌, సముద్రఖని వంటి ప్రముఖులు నటిస్తున్నారు. అడవి శేష్ చేతుల మీదుగా విడుదలైన మెమొరీస్ మల్టీలింగ్యువల్‌ మ్యూజిక్‌ వీడియో సుధాకర్ నిర్మాణంలో శాన్‌ఫ్రానిస్కోలో చిత్రీకకరించారు. సుధాకర్‌ భార్య పేరు హారిక. వారికి ఒక బాబు ఉన్నాడు. పేరు రుద్ర. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Frequently Asked Questions

సుధాకర్ కోమాకుల ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

సుధాకర్ కోమాకుల 1989లో విశాఖపట్నంలో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచే కళలు, ముఖ్యంగా డ్యాన్స్, నటన పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు.

నటుడు కావడానికి ముందు సుధాకర్ ఏమి చేయాలనుకున్నారు?

సుధాకర్ మొదట్లో డ్యాన్స్ మాస్టర్ కావాలని హైదరాబాద్ వచ్చి కొరియోగ్రఫీ కోర్సు చేశారు. అయితే, ఒక ప్రమాదం కారణంగా అతని కలకు ఆటంకం ఏర్పడింది.

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో సుధాకర్ పోషించిన పాత్ర పేరు ఏమిటి?

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో సుధాకర్ పోషించిన నాగరాజు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలంగాణ యాసలో సంభాషణలతో ప్రేక్షకులను అలరించింది.

సుధాకర్ నిర్మాతగా ఎప్పుడు మారారు, మరియు ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ పేరు ఏమిటి?

సుధాకర్ తన భార్య హారికతో కలిసి 'సుఖ మీడియా' అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. వినూత్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

'నువ్వు తోపురా' సినిమాకు సుధాకర్ కు ఎలాంటి గుర్తింపు వచ్చింది?

'నువ్వు తోపురా' చిత్రానికి సుధాకర్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా 2020 ఉటా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'మేడ్ ఇన్ ఊటా' కేటగిరిలో బెస్ట్ పిక్చర్ అవార్డు గెలుచుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget