By: ABP Desam | Updated at : 29 May 2023 08:55 PM (IST)
Image Credit: haarikahassine/Twitter
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ క్రేజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్, దివంగత కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న టైటిల్ ను ప్రకటించి, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
కృష్ణ జయంతి కానుకగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని 4K ఫార్మెట్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో SSMB28 చిత్రానికి సంబంధించిన టైటిల్ తో కూడిన గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. సూపర్ స్టార్ అభిమానుల చేతులమీదుగా ‘మాస్ స్ర్టైక్’ పేరుతో ఈ వీడియోని లాంచ్ చేయనున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్ గా మహేష్ బాబు మాస్ లుక్ ని రివీల్ చేసారు.
SSMB28 న్యూ పోస్టర్ లో కబడ్డీలో కూతకు వెళ్తున్న ఆటగాడిలా కనిపిస్తున్నాడు మహేష్. కాకపోతే ఇక్కడ రౌడీల పనిపట్టడానికి కబడ్డీ కబడ్డీ అంటూ బరిలో దిగితున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెడకు తలకట్టు, చెక్స్ షర్ట్ లో ఓవైపు మాస్ గా మరోవైపు క్లాస్ గా ఉన్నారు సూపర్ స్టార్. మరో రెండు రోజుల్లో రాబోయే మాస్ స్ర్టైక్ కచ్చితంగా అభిమానులకి మాస్ ఫీస్ట్ అవుతుందని ఈ పోస్టర్ హామీ ఇస్తోంది.
The Thunderous #SSMB28MassStrike arrives in just 2 Days 🔥🔥
Our Beloved SUPER FANS to launch at the theatres near you on May 31st 🤩
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash pic.twitter.com/KK48BOrUgG— Haarika & Hassine Creations (@haarikahassine) May 29, 2023
మహేష్ బాబు గతంలో 'ఒక్కడు' సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా నటించారు. 2003లో వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు కబడ్డీ ఆడబోతున్నాడు. అదే సెంటిమెంట్ తో SSMB28 కూడా బాక్సాఫీస్ వద్ద కబడ్డీ ఆడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేస్తూ.. ''మా డార్లింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మరియు మా సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ థమన్ కాంబినేషన్ SSMB28 Mass Strikeతో పిడుగులాంటి మాస్ స్ట్రైక్ ఇవ్వబోతోంది. కాబట్టి మీ సందేహాలన్నింటినీ వెనుక సీట్లో వదిలేయండి. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వింటేజ్ మాస్ చూడబోతున్నారు'' అని పేర్కొన్నారు.
కాగా, ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రమిది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘అమరావతికి అటూ ఇటూ’ ‘గుంటూరు కారం’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మహేష్ క్యారెక్టరైజేషన్ కి సరిగ్గా సరిపోతుందని, చివరకు 'గుంటూరు కారం' వైపే మేకర్స్ మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది.
SSMB28 చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Also: PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
Siddharth: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్‌కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్
Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
/body>