అన్వేషించండి

SSMB 29: మహేష్ బాబు కోసం హాలీవుడ్ సెలబ్రిటీని రంగంలోకి దించుతున్న రాజమౌళి?

‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా స్వాతంత్య్రం సమయంలో జరిగింది కాబట్టి దానికోసం చాలామంది హాలీవుడ్ నటీనటులను రంగంలోకి దించాడు రాజమౌళి.

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమాకు విపరీతమైన క్రేజ్ లభించింది. అందుకే బాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. హాలీవుడ్ నుంచి కూడా నటీనటులు వచ్చి.. తెలుగులో నటించడానికి ఇష్టపడుతున్నారు. RRR మూవీ తరహాలోనే రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట.

దాదాపు మూడేళ్లకు ఒక సినిమా చేసినా కూడా రాజమౌళి సినిమాల కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తారు. ఆయన సినిమాలకు కూడా, ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లారు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తున్న మూవీతో టోటల్‌గా వరల్డ్ బాక్సాఫీస్‌నే షేక్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న రాజమౌళి ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

మహేశ్ కెరీర్‌లో 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 

ఓవైపు స్క్రిప్టింగ్.. మరోవైపు ప్రీ ప్రొడక్షన్

ప్రస్తుతం ఎస్ఎస్ఎమ్‌బీ 29 ఇంకా స్క్రిప్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఓవైపు స్క్రిప్టింగ్ జరుగుతుండగానే.. సిద్ధమైన స్క్రిప్ట్ వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లిన SSMB29 అప్డేట్ గురించే చెప్తారని ప్రేక్షకులు ఆశించడం మొదలుపెట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యి ఏడాది అయినా కూడా రాజమౌళి మరో సినిమాను ప్రారంభించకపోవడం వారిని మరింత నిరాశకు గురిచేస్తోంది. మామూలుగా సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాతే మూడేళ్లు షూటింగ్‌కు టైమ్ తీసుకునే రాజమౌళి.. ఇప్పుడు మహేశ్ సినిమాకు ఎంత ఆలస్యం చేస్తాడో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతలోనే ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్.

SSMB29లో హాలీవుడ్ యాక్టర్

‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా స్వాతంత్య్రం సమయంలో జరిగింది కాబట్టి దానికోసం చాలామంది హాలీవుడ్ నటీనటులను రంగంలోకి దించాడు రాజమౌళి. ఇక ఎస్ఎస్ఎమ్‌బీ 29 కూడా గ్లోబల్ అడ్వెంచర్ జోనర్ మూవీ కావడంతో ఇందులో కూడా ఒక హాలీవుడ్ సెలబ్రిటీ ఉంటారని విజయేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా ఆఫ్రికన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనుందట. ‘ఆర్ఆర్ఆర్’తో ఓలివియా మారిస్ లాంటి హాలీవుడ్ నటికి టాలీవుడ్‌లో ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసిన రాజమౌళి.. ఈసారి ఎవరిని తీసుకొస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక మహేశ్ విషయానికొస్తే.. ప్రస్తుతం తను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ, శ్రీలీల కనిపించనున్నారు. 

Also Read: ముందు ప్రపోజ్ చేసిందెవరు? - లావణ్య త్రిపాఠితో ప్రేమకథ చెప్పిన వరుణ్ తేజ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget