అన్వేషించండి

మహేష్ మూవీ పనులు షురూ చేసిన జక్కన్న, అల్యూమినియం ఫ్యాక్టరీలో కళ్లు చెదిరే సెట్స్

మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు.

SS Rajamouli Leases Aluminium Factory Land : తెలుగు సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలతో ఇండియన్ సినిమాల సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కించబోతున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన చేయగా, ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాను ఏకంగా రూ. 1000 కోట్లతో తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇప్పటికే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

అల్యుమినియం ఫ్యాక్టరీ భూమిని లీజ్ కు తీసుకున్న రాజమౌళి

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా సెట్స్ నిర్మిస్తున్నారట. రాజమౌళి సినిమా అనగానే విజువల్ వండర్ గా ఉంటుంది. ఈ సినిమాలోనూ కనీవినీ ఎరుగని సీన్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీ భూమిని లీజుకు తీసుకున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి 9 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారట. ఇందులో 4 ఎకరాల్లో ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. హైదరాబాద్ లోనే అత్యంత సువిశాల ప్రాంతం కావడం, ఎలాంటి రణగొణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా ఉండటంతో ఇక్కడ చాలా సినిమాలను షూట్ చేస్తారు. ఇప్పుడు జక్కన్న కూడా అక్కడే సెట్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాపులు కూడా అక్కడే నిర్వహించాలని భావిస్తున్నారు.  

‘RRR’ షూటింగ్ కూడా ఇక్కడే..

నిజానికి ‘RRR’ సినిమాకు సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్స్ వేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి కొంత భాగాన్ని లీజుకు తీసుకుని ఈ సెట్స్ నిర్మించారు. ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా అక్కడే సెట్స్ వేస్తున్నారు. గత కొద్ది రోజులు ఇక్కడే ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనూ ఈ సెట్స్ నిర్మాణం కూడా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ పనులు పూర్తిగానే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రపంచంలోని పలు దేశాల్లో నిర్వహించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

విజయేంద్ర ప్రసాద్ కథ, కీరవాణి సంగీతం

మహేష్ బాబు సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనే విషయానికి సంబంధించి ఆయన ఇప్పటికే కీలక అప్ డేట్స్ ఇచ్చారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ ను రెడీ చేసుకున్నారట రాజమౌళి.

Read Also: ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్ లో ‘యానిమల్’ బ్యూటీ రియాక్షన్ - ‘నేషనల్ క్రష్’ కామెంట్స్ పై ఏం చెప్పిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Thiruppavi pasuralu: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
ధనుర్మాసం స్పెషల్: తిరుప్పావై డిసెంబర్ 19, 20, 21...ఈ మూడు రోజులు పఠించాల్సిన పాశురాలు - వాటి అర్థం!
Embed widget