Sriranga Neethulu Trailer: ముగ్గురు యువకుల కథలతో ‘శ్రీరంగనీతులు’ - ఆకట్టుకుంటున్న సుహాస్ కొత్త సినిమా ట్రైలర్
సుహాస్ కొత్త మూవీ ‘శ్రీరంగనీతులు’ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ముగ్గురు యువకుల కథల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Sriranga Neethulu Trailer Out: యంగ్ యాక్టర్స్ సుహాస్, కార్తీక్‌రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’శ్రీరంగనీతులు’. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆకట్టుకుంటున్న ’శ్రీరంగనీతులు’ ట్రైలర్
తాజాగా విడుదలైన ’శ్రీరంగనీతులు’ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తోంది. ముగ్గురు యువకుల కథలను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. యువతలోని భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. తమను తాము నిరూపించుకునేందుకు ముగ్గురు యువకులు పడే తపన ఇందులో కనిపిస్తోంది. చక్కటి డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలు అలరిస్తున్నాయి.ఇక ఈ ట్రైలర్ లో సుహాస్ కు రాజకీయంగా ఎదగాలనే కోరిక ఉంటుంది. ఎలాగైనా ప్రజల దృష్టిలో పడాలని పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాడు. అటు విరాజ్, రుహాని ప్రేమలో పడతారు. రుహానికి పేరెంట్స్ మరో సంబంధం తీసుకొస్తారు. ఆమెకు నచ్చదు. అదే సమయంలో విరాజ్, రుహాని మధ్యలో గొడవ జరుగుతుంది. ఇక కార్తీక్ ను తాగుడుకు బానిసగా చూపిస్తారు. ఇంతకీ ఆయన ఎందుకు తాగుడుకు బానిస అయ్యారు అనే విషయాన్ని మాత్రం ట్రైలర్ లో రివీల్ చేయలేదు. ముగ్గురు కథలతో నడుస్తున్న ఈ సినిమాలో వీరికి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. మొత్తంగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది.
సుహాస్ ఖాతాలో మరో హిట్ పడుతుందా?
ఇక ’శ్రీరంగనీతులు’ సినిమాతో సుహాస్ మరోసారి తనసత్తా చాటుకోబోతున్నారు. విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకుసాగుతున్న ఆయన, తాజాగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’తో అలరించాడు. ఎమోషన్స్ తో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సుహాస్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ’శ్రీరంగనీతులు’ ఒకటి. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగా అలరించిన నేపథ్యంలో, ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ’శ్రీరంగనీతులు’ సినిమాను రాధావి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకటేశ్వర రావు బల్మూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డీఓపీగా టీజో టామీ వ్యవహరిస్తున్నారు. సంగీతం హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ అందిస్తున్నారు. శశాంక్ ఉప్పటూరి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
View this post on Instagram
Read Also: ‘లైలా’గా విశ్వక్ సేన్ - బుల్లెట్‌కు బదులు లిప్‌స్టిక్, సార్ మీరు మేడమా?