Srikanth Iyengar: రివ్యూ రైటర్లకు చుక్కలు చూపిస్తా... డబ్బులు పడేస్తా... ఎందుకీ మాటలు, పబ్లిసిటీ కోసమేనా?
Srikanth Iyengar Controversy: నటనతో, మంచి క్యారెక్టర్లతో పేరు తెచ్చుకునే నటులు కొందరయితే... నిత్యం వివాదాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేది మరికొందరు. శ్రీకాంత్ అయ్యంగార్ రెండో కేటగిరి ఏమో?

Srikanth Iyengar controversial comments on review writers: యాక్టర్స్ చాలామంది గురించి మీడియా మాట్లాడుతుంది. మీడియా మాత్రమే కాదు... ప్రేక్షకులు కూడా మాట్లాడుతారు. కొన్ని సందర్భాలలో మీడియా మర్చిపోయినా సరే... సోషల్ మీడియాలో తమకు నచ్చిన యాక్టర్లను ఆడియన్స్ హైలైట్ చేస్తున్నారు. వాళ్ల గురించి మాట్లాడుతున్నారు. తన గురించి ఎవరూ మాట్లాడటం లేదని నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. అందుకే మైక్ దొరికిన ప్రతిసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ... నలుగురి కంటపడాలని ప్రయత్నిస్తున్నారు. మరొకసారి ఆయన రివ్యూ రైటర్ ల మీద విరుచుకుపడ్డారు.
'రాచరికం' ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీకాంత్ అయ్యంగార్ చిందులు!
కొత్త ఏడాది (2025) మొదలై నెల కూడా పూర్తి కాలేదు. అప్పుడే నాలుగు సినిమాలతో శ్రీకాంత్ అయ్యంగార్ థియేటర్లలోకి వచ్చారట. ఆ విషయం ఆయన చెబితే తప్ప ప్రేక్షకులకు తెలియలేదు. అంటే... ఏయే సినిమాల్లో ఎక్కడెక్కడ కనిపించారో చెబితే గుర్తు పట్టడానికి వీలవుతుంది. నాలుగు సినిమాల్లో నటించిన ఆడియన్స్ గానీ, రివ్యూ రైటర్లు గానీ తన గురించి గొప్పగా మాట్లాడడం లేదు అనుకున్నారో ఏమో!? రాచరికం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రివ్యూ రైటర్స్ మీద తన అక్కసును వెళ్ళగక్కారు.
రివ్యూ రైటర్ల మీద శ్రీకాంత్ అయ్యంగార్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది ఏమీ తొలిసారి కాదు. అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన పొట్టేల్ సినిమా విడుదలైన తర్వాత నిర్వహించిన ఒక విలేకరుల సమావేశంలో పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. బహుశా ఆయన తాగి వచ్చి ఆ విధంగా మాట్లాడారేమోనని సోషల్ మీడియాలో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అప్పట్లో శ్రీకాంత్ అయ్యంగార్ తీరు మీద విమర్శలు వచ్చాయి. దాంతో క్షమాపణలు చెబుతానంటూ కాస్త వ్యంగ్యంగా, వెటకారంగా వీడియో విడుదల చేశారు. ఆ మాటలను సైతం పట్టించుకోవడం మానేశారు జనాలు.
ఇప్పుడు మరొకసారి రాచరికం స్టేజ్ మీద రివ్యూ రైటర్లకు చుక్కలు చూపిస్తానంటూ శ్రీకాంత్ అయ్యంగార్ చిందులు తొక్కారు. రివ్యూ రేటింగ్ బట్టి డబ్బులు ఇస్తానని, తనకు సోషల్ మీడియాలో మెసేజ్ చేయమని చెప్పుకొచ్చారు. రివ్యూ రైటర్లను రిక్వెస్ట్ చేయవద్దని, చెడుగుడు ఆడుకోవాలని ఇండస్ట్రీకి సలహా ఇచ్చారు శ్రీకాంత్ అయ్యంగార్.
Also Read: తమిళ నటితో తెలుగు దర్శకుడి ఎఫైర్... ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్?
రివ్యూ రైటర్ల మీద విమర్శలు వ్యక్తం చేసే బదులు... ప్రతి సినిమానూ ప్రశంసిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ తన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేయకూడదు? ప్రేక్షకులలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది గనుక ఆయన చెబితే ప్రేక్షకులు వింటారు గనుక సినిమాలకు వెళ్ళమని అందులో మంచిని గుర్తించమని ప్రతి సినిమా గురించి ఆయన ఎందుకు రాయకూడదు? వంటి సలహాలు రివ్యూ రైటర్లు ఇస్తున్నారు. పబ్లిసిటీ కోసం రివ్యూ రైటర్ల మీద పడి ఏడవడం ఎందుకు? అని అతడిని చూసి నవ్వుకునే జనాలు కూడా ఉన్నారు. కూటి కోసం కోటి విద్యలు... పబ్లిసిటీ కోసం పలు విమర్శలు... కాంట్రవర్సీలతో పబ్లిసిటీ పొందడం కంటే క్యారెక్టర్లలో అద్భుతమైన నటన కనబరిచి నలుగురి కంట పడడం మంచిదేమో!? శ్రీకాంత్ అయ్యంగార్... ఒక్కసారి ఆలోచించు! ఆయన పబ్లిసిటీ కోసం చేసే మాటలు చెడు ఎక్కువ చేస్తోంది. పొట్టేల్ ప్రెస్‌మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వల్ల థియేటర్లకు జనాలు రాలేదు సరికదా, ఇంకా బ్యాడ్ చేసింది.




















