అన్వేషించండి

Sreeleela: స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల - మాట నిలబెట్టుకుంది అంటున్న ఫ్యాన్స్

Sreeleela: తాజాగా శ్రీలీల ఒక తమిళ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట. దీంతో తన పాత స్టేట్‌మెంట్ ఒకటి గుర్తుచేసుకొని మాట నిలబెట్టుకుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Sreeleela Rejects GOAT Offer: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అనగానే చాలామందికి శ్రీలీల పేరే గుర్తొస్తుంది. తన డ్యాన్స్‌తో, యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులతో పాటు మేకర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ భామ. అందుకే ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కొంతకాలానికే చాలామంది స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక టాలీవుడ్‌లో సత్తా చాటుకున్న తర్వాత కోలీవుడ్‌పై కూడా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల ఆఫర్లు వస్తున్నా కూడా అందులో ఒక ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట శ్రీలీల.

అందుకే రిజెక్ట్..

2023లో నాలుగు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేసింది శ్రీలీల. కానీ 2024లో మాత్రం ఇప్పటికీ తనది ఒక్క సినిమా మాత్రమే విడుదలయ్యింది. ఇంకొకటి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో శ్రీలీల.. కోలీవుడ్‌లో అడుగుపెట్టే సన్నాహాలు చేస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గోట్’లో శ్రీలీలకు ఛాన్స్ కూడా వచ్చిందట. కానీ అంత పెద్ద ఆఫర్‌ను పెద్దగా ఆలోచించకుండానే రిజెక్ట్ చేసిందట ఈ యంగ్ హీరోయిన్. ఎందుకంటే తనకు ఆఫర్ వచ్చింది ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించడానికి మాత్రమే.

ఒకప్పటి స్టేట్‌మెంట్..

టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో తన సత్తా ఏంటో చాటుకున్న శ్రీలీల.. కోలీవుడ్‌ను తన కెరీర్‌ను ఒక స్పెషల్ సాంగ్‌తో ప్రారంభించడం ఇష్టం లేదని, అందుకే ‘గోట్’ ఛాన్స్‌ను రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఒకప్పుడు శ్రీలీల చేసిన వ్యాఖ్యలను కూడా తన ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. తను ఎప్పటికీ స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ అనేవి చేయను అని, తనకు దగ్గరయిన వాళ్లకు అలా చేయడం నచ్చదని శ్రీలీల.. కొన్నాళ్ల క్రితం ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఒకప్పుడు తాను అన్నట్టుగానే ఇప్పుడు మాట నిలబెట్టుకుందని, విజయ్ లాంటి స్టార్ పక్కన స్పెషల్ సాంగ్‌లో నటించడానికి ఒప్పుకోలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

‘గుంటూరు కారం’ చివరిగా..

శ్రీలీల.. ఒక సినిమాలో నటిస్తుంది అనగానే తన దగ్గర నుండి అదిరిపోయే మాస్ స్టెప్పులు ఆశిస్తారు ఫ్యాన్స్. ఇప్పటికే 2024 సంక్రాంతికి మహేశ్ బాబుతో కలిసి స్టెప్పులేసి అందరినీ హ్యాపీ చేసింది ఈ యంగ్ హీరోయిన్. ‘గుంటూరు కారం’లో మహేశ్ బాబు, శ్రీలీల కలిసి చేసిన డ్యాన్సులకు థియేటర్లలో ప్రేక్షకులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత మహేశ్ ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం చూస్తున్నామని, అది కూడా శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ ట్విటర్ అంతా వీరి డ్యాన్స్ గురించి మారుమోగిపోయింది. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో కలిసి శ్రీలీల నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: థియేటర్లలో ఈ వారం సందడి... పవన్ 'వకీల్ సాబ్' to నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు', వరలక్ష్మీ 'శబరి'

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget