News
News
వీడియోలు ఆటలు
X

Sreeleea In PVT 04 : చిత్రగా శ్రీలీల వచ్చేసింది - మెగా మేనల్లుడి సినిమా ఎలా ఉంటుందో?

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'PVT04'లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో ఆమె చిత్ర క్యారెక్టర్ లో కనిపించనుందని పోస్టర్ ద్వారా తెలిపారు

FOLLOW US: 
Share:

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej)కు జోడీగా ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్ శ్రీ లీల (Sreeleela) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రమిది. అందుకని, వర్కింగ్ టైటిల్  PVT 04 అని పెట్టారు. 

చిత్రగా శ్రీ లీల
సినిమాలో శ్రీ లీల ఫస్ట్ లుక్ (Sreeleela First Look) ఈ రోజు విడుదల చేశారు. చిత్ర పాత్రలో ఆమె నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె పాత్ర ప్రేక్షకుల మనసు దోచుకునేలా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ సినిమాలో తమిళ బ్యూటీ అపర్ణా దాస్ నటిస్తోందని, వజ్ర కాళేశ్వరి దేవిగా కనిపించనున్నట్టు ప్రకటించారు.

Also Read 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?

View this post on Instagram
 
A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో 'PVT04' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ మూవీకి నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ కోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా.. కేవలం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తుంచినట్టు తెలుస్తోంది.

డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి 'PVT04'సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి.

'అసురన్‌', 'ఆడుకలం' వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్‌ కుమార్‌ మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ తో చేతులు కలిపారు. ఇటీవల వీరి కలయికలో వచ్చిన సార్/వాతి చార్ట్‌బస్టర్‌ గా నిలిచిన విషయం తెలసిందే..

ఇక 'PVT04'మూవీకి సంబంధించి త్వరలోనే ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా అదిరిపోయే యాక్షన్ గ్లింప్స్ విడుదల కానుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. PVT04కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నట్టు తెలుస్తోంది.

Also Read : 'కేరళ స్టోరీ'కి గోవా ముఖ్యమంత్రి మద్దతు - అందరూ చూడాలంటూ...

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించిన చిత్రం 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీల.. మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోష‌న్ హీరోగా నటించారు. కెరీర్‌లో మొదట్లోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ.. గతేడాది చివర్లో రవితేజతో చేసిన ‘ధమాకా’ మూవీతో ధమాకా లాంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సరసన 'PVT04' సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఆమె ఈ సారి ఏ తరహా ఎంటర్టైన్మెంట్ ను అందించబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published at : 13 May 2023 02:09 PM (IST) Tags: Panja Vaisshnav Tej Sreeleela TOLLYWOOD Sreeleela As Chitra Sreeleela First Look PVT 04 Movie Updates

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ -  వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?