News
News
వీడియోలు ఆటలు
X

Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రపటం - ఎల్లలు దాటిన ఫ్యాన్స్ ప్రేమ

రీల్ లైఫ్ లో విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్... రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా పాపులర్ అయ్యారు. ఆయనపై ప్రేమను వ్యక్తం చేస్తూ అభిమానులు 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రపటాన్ని రూపొందించారు.

FOLLOW US: 
Share:

Sonu Sood : సినిమాల్లో విలనే అయినా.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్ పై ఆయన అభిమానులు సరికొత్తగా అభిమానాన్ని చాటుకున్నారు. 2500 కేజీల బియ్యంతో ఆయన చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. మధ్య ప్రదేశ్ లోని ఓ అభిమాన సంఘం తీర్చి దిద్దిన ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది అన్నార్థులకు సాయం చేసిన మానవతావాది హీరో సోనూసూద్. తన సొంత డబ్బుతో కరోనా కాలంలో మరెంతో మంది దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాంతాలకు చేర్చిన మహానుభావుడు. అంతే కాదు చిన్నారులకు గుండె ఆపరేషన్లు కూడా చేయించాడు. ఆర్థికంగా ఇబ్బంది పడే, అనారోగ్యంతో బాధపడే మరెంతో మందికి ఆసరాగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో ఆయనను ఆదర్శంగా తీసుకున్న చాలా మంది ఫ్యాన్స్.. ఆయన పేరిట అన్నదానాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన బాటలో నడుస్తున్నారు.

ఓ యాక్టర్ గా ఇప్పటికే నిరూపించుకున్న సోనూసూద్.. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన ప్రజల మనిషిగా ఎంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటివరకు అనేక మంది అనేక రకాలుగా సోనూసూద్ పై ప్రేమను వ్యక్తం చేసినా.. తాజాగా ఓ అభిమాన సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న తుకోజీ రావ్ పవార్ స్టేడియంలో ఎకరం స్థలంలో 2500 కిలోల బియ్యాన్ని ఉపయోగించి నటుడు సోనూసూద్ చిత్ర పటాన్ని రూపొందించారు. ప్లాస్టిక్ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూ సూద్ రూపాన్ని తీర్చిదిద్దారు.

అంతే కాదు సోనూ చిత్రం కోసం ఉపయోగించిన బియ్యాన్ని ‘హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన, కనీస సౌకర్యాలు లేని కుటుంబాలకు అందజేయడం మరో గొప్ప విషయం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సోనూసూద్‌ అభిమానుల గొప్ప మనసును మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియోను సోనూ సూద్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు 1 ఎకరం భూమి, పేదలకు 2500 కిలోల బియ్యం, టన్నులల్లో స్వచ్ఛమైన ప్రేమ.. మాటల్లో చెప్పలేనంత వినయం అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సైతం నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా అభిమానులు తనపై ఈ రకంగా ప్రేమను వ్యక్తం చేయడంపై వారికి సోనూసూద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “ప్రతిరోజూ అభిమానులు చాలా రకాలుగా తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞుడను అని అన్నారు. ఇలా 'ప్రజలకు సహాయం' చేస్తూ.. తనను ఇష్టపడుతూ ముందుకు వెల్లడం చాలా అద్భుతంగా అనిపిస్తోందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈ పోస్ట్ సైతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక సోనూసూద్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ‘ఫతే’ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ టెలివిజన్ షో 'రోడీస్' రాబోయే సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ఇటీవలే స్పష్టం చేశారు.

Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Published at : 12 Apr 2023 02:17 PM (IST) Tags: Sonu Sood Real Hero Sonu Sood Fans Helping Hand Hero Sonu Sood Portrait

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ