Nani31: నాని కొత్త సినిమాలో తమిళ నటుడు - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్!
నేచురల్ స్టార్ నాని తన 31వ సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్. జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

కోలీవుడ్ దర్శకుడు SJ సూర్య నటుడిగా ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో బిగ్ స్క్రీన్స్ పై అలరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూ సందడి చేస్తున్నారు. రీసెంట్గా విశాల్ నటించిన 'మార్క్ ఆంటోనీ' మూవీలో తన పర్ఫామెన్స్తో సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఈయన ఇప్పుడు తెలుగులో మరో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ అనౌన్స్మెంట్ వీడియోలో సోమవారం సినిమాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని, మంగళవారం గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా థ్రిల్ అయ్యే ఎలిమెంట్లు, చిల్ అయ్యేలా ఫుల్ ఫన్ తో ఈ మూవీ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. వివేక్ ఆత్రేయతో ఇప్పటికే నాని 'అంటే సుందరానికి' అనే సినిమా చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ కలిసి వర్క్ చేస్తున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించిన దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ని వెల్లడించారు.
Delighted to have the majestic @iam_SJSuryah on board and he's ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
అదేంటంటే ఈ చిత్రంలో తమిళ నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో SJ సూర్య ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని కెరియర్ లో 31వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే నానితో కలిసి 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి వీరి జంట బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాని 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది.
శౌర్యవ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ నేపథ్యంలో ఎమోషనల్ జర్నీగా ఉండబోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాలో శృతిహాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదటగా క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి 'సలార్' మూవీ రిలీజ్ ఉండడంతో డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.
Also Read : అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'చంద్రముఖి 2' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















