Madharaasi Collections - 'మదరాసి' కలెక్షన్స్: ఫ్లాప్ టాక్‌తో శివకార్తికేయన్ రికార్డులు క్రియేట్ చేశాడా? ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Madharaasi Box Office Collection Day 1: 'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్ నటించిన సినిమా 'మదరాసి'. ఫస్ట్ డే ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

Madharaasi Movie Box Office Collection Day 1: కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ ప్రామిసింగ్ స్టార్ హీరో మెటీరియల్ అనిపించుకున్న శివ కార్తికేయన్ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా మదరాసి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ తీసిన ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ చేశారు. ఫస్ట్ డే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
మొదటి రోజు 'మదరాసి'కి 13 కోట్లు!
'మదరాసి' విడుదలకు ముందు మంచి అంచనాలు ఉన్నాయి. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ చేసిన బాలీవుడ్ ఫిలిం 'సికిందర్' డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చినా... 'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్ చేసిన సినిమా కావడంతో 'మదరాసి' మీద ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్ బాగా నడిచింది. అయితే రిలీజ్ డే ఫస్ట్ షో తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో ఓపెనింగ్ డే కేవలం 13 కోట్ల రూపాయల కలెక్షన్లతో సినిమా సరిపెట్టుకుంది.
ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్‌లో లేవు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు కాంపిటీషన్ లేదు. దీంతో పాటు విడుదలైన ఘాటీ మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది దాంతో మొదటి రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు బుకింగ్స్ కూడా బాగున్నాయి. తెలుగులో 'మదరాసి'కి ప్లాప్ టాక్ వచ్చింది కానీ తమిళ్ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతోంది.
'మదరాసి' విడుదల తర్వాత మురుగదాస్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆయనలో సత్తా తగ్గిందని చాలామంది కామెంట్ చేశారు. శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ జంటగా నటించిన 'మదరాసి' సినిమాలో విద్యుత్ జమాల్ బిజు మీనన్ విక్రాంత్ తదితరులు యాక్ట్ చేశారు. తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. సినిమా ఫస్ట్ డే పరవాలేదు అనుకున్నా ప్రజెంట్ మౌత్ టాక్ చూస్తే బ్రేక్ ఈవెన్ కావడం కష్టం అని అర్థం అవుతుంది.
Also Read: 'ఘాటీ' కలెక్షన్స్: తెలుగు రాష్ట్రాల్లో అనుష్క సినిమాకు ఫస్ట్ డే ఊహించని రిజల్ట్





















