By: ABP Desam | Updated at : 23 May 2022 09:43 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
శేఖర్ సినిమాలో రాజశేఖర్, శివాని రాజశేఖర్
రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్' గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. ఈ వివాదంలో చిత్రబృందానికి అనుకూలంగా న్యాయమూర్తి మాట్లాడినట్టు సమాచారం. 'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామసలు చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారని తెలుస్తోంది. కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని సమాచారం. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు జీవిత రాజశేఖర్, నిర్మాత తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివాని రాజశేఖర్ నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రథమార్థం స్లోగా సాగినా... ద్వితీయార్థం రేసీగా ఉంటుంది. ఎమోషనల్ నోట్‌లో సినిమాను ముగించారు.
Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం
Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు