Shahid Kapoor Kriti Sanon Look : బీచ్‌లో బైక్ మీద షాహిద్, కృతి రొమాన్స్ - అక్టోబర్‌లో అసాధారణ ప్రేమకథ
బాలీవుడ్ సూపర్ స్టార్ షాహిద్ కపూర్, నటి కృతి సనన్ తొలిసారి జంటగా నటిస్తున్న మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజైంది. ఆన్ ఇంపాసిబుల్ లవ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో రిలీజే చోసిన ఈ రొమాంటిక్ లుక్ వైరల్ గా మారింది.
Shahid Kapoor : బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్ (Shahid Kapoor ), - కృతి సనన్ (Kriti Sanon) జంటగా తెరకెక్కనున్న సినిమాపై మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. 'కాక్‌టెయిల్ (Cocktail)', 'లవ్ ఆజ్ కల్(Love Aaj Kal', 'లుకా చుప్పి (Luka Chuppi)' వంటి రిఫ్రెష్ రోమ్ కామ్‌లను ప్రొడ్యూస్ చేసిన దినేష్ విజన్ (Dinesh Vijan) ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పోస్టర్ ను నటి కృతి సనన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. షాహిద్ కపూర్ - కృతి సనన్ కాంబోలో వస్తోన్న ఈ లేటెస్ట్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో అత్యంత ఇష్టపడే నటుల్లో ఒకరు షాహిద్ కపూర్ - కృతి సనన్. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా వెండితెరపై రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త ఎప్పట్నుంచో వినిపిస్తుండగా.. తాజాగా ఈ మూవీలోని ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో షాహిద్, కృతి ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా బైక్‌పై చాలా రొమాంటిక్‌గా కూర్చున్నారు. షాహిద్ బ్లూ డెనిమ్ బూట్లతో పాటు తెల్లటి చొక్కా ధరించి ఉండగా, కృతి పొట్టి స్కర్ట్, క్రాప్ టాప్ ధరించి ఉంది. సూర్యాస్తమయం బ్యాక్‌డ్రాప్‌లో వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. సిజ్లింగ్ హాట్ కెమిస్ట్రీతో మైమరపిస్తోన్న ఈ ఈ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. సినిమాపై మరింత హోప్స్ పెరిగేలా చేస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ లో మూవీ పేరును మాత్రం మేకర్స్ రిలీజ్ చేయలేదు. దీంతో సినిమా పేరుపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ నేమ్ చెప్పకపోయినా.. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం వెల్లడించడం గమనార్హం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు "ఆన్ ఇంపాసిబుల్ లవ్ స్టోరీ" అనే ట్యాగ్ లైన్ ను చేర్చడం మరింత ఇంట్రస్టింగ్ టాపిక్ గా కనిపిస్తోంది.
రొమాంటిక్ ఫోజ్ లో ఉన్న వీరిద్దరి విజువల్ ట్రీట్ ను నటి కృతి సనన్ ఇన్స్ స్టా ద్వారా పంచుకున్నారు. దాంతో పాటు తమ ఇంపాసిబుల్ లవ్ స్టోరీ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నామన్నారు. వీటితో పాటు ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానున్నట్టు కృతి వెల్లడించారు. దీనిపై నెటిజన్‌లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ కబీర్ సింగ్ (Kabir Singh) పోస్టర్‌లా ఉందంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా డైరెక్టర్ అమిత్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే & లక్ష్మణ్ ఉటేకర్ నిర్మించారు. కాగా ఈ సినిమాను జియో స్టూడియోస్, మాడాక్ ఫిల్మ్ నిర్మిస్తోంది.
View this post on Instagram