News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'టైగర్ Vs పఠాన్' - మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్, రిలీజ్ ఎప్పుడంటే?

షారుఖ్, సల్మాన్ కాంబినేషన్లో సిద్ధార్థ్ ఆనంద్ స్పై యూనివర్స్ లో భాగంగా 'టైగర్ Vs పఠాన్' మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనన్నట్లు సమాచారం.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ ప్రాజెక్టు ఉండనుందట. ఈ ఏడాది ఆరంభంలో సల్మాన్, షారుక్ ని ఒకే సినిమాలో చూపించి బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లు కొల్లగొట్టిన యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈసారి అంతకుమించి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. 'పఠాన్' లో షారుక్, సల్మాన్ ని చూసి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు. అయితే ఈసారి షారుక్ Vs సల్మాన్ ల మధ్య భీకర పోరు ఉంటుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తుండగా, ఎట్టకేలకు ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ వచ్చినట్లు బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి.

గత కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ ఆదిత్య చోప్రా స్పై యూనివర్స్ లో భాగంగా షారుక్, సల్మాన్ ని విడివిడిగా కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' లో షారుక్ 'పఠాన్' గా క్యామియో రోల్ చేస్తున్నారు. సుమారు 15 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ లోనే తర్వాత షారుక్ Vs సల్మాన్ మూవీ ప్లాట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారట. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయినట్లు సమాచారం. షారుక్, సల్మాన్ ఖాన్ మధ్య బ్రిడ్జిపై ఓ భారీ బైక్ చేజ్ ఎపిసోడ్ ఫైట్స్ సీన్ షూట్ చేశారు. 'టైగర్3' నుంచే టైగర్ Vs 'పఠాన్' కథ మొదలవుతుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ నవంబర్ నుండి ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి 2024 దీపావళి సీజన్ కి కానీ 2025 జనవరి 25న కానీ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్యాక్డ్ ఎంటర్టైనర్ గా టైగర్ Vs పఠాన్ రానుంది. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఇది 6వ ప్రాజెక్టు కావడం విశేషం. 2012లో సల్మాన్ ఖాన్ 'ఏక్తా టైగర్' నుంచి ఈ స్పై యూనివర్స స్టార్ట్ అవ్వగా, ఆ తర్వాత అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో వచ్చిన 'టైగర్ జిందా హై', సిద్ధార్థ్ ఆనంద్ 'వార్', 'పఠాన్', మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా త్వరలోనే 'టైగర్ 3' రాబోతోంది.

'టైగర్ 3' లో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'టైగర్ జిందా హై' తో స్క్రీన్ పై అలరించిన సల్మాన్, కత్రినా ల జోడి మరోసారి 'టైగర్ 3' రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. షారుక్ 'జవాన్' తర్వాత సల్మాన్ 'టైగర్ 3' ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పటినుంచే అంచనా వేస్తున్నారు.

Also Read : ఓటీటీలో అదరగొడుతున్న గోపిచంద్ డిజాస్టర్ మూవీ - నెట్ ఫ్లిక్స్ టాప్-1 ట్రెండింగ్ లో రామబాణం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Published at : 16 Sep 2023 09:02 PM (IST) Tags: Shah Rukh Khan Siddharth Anand yash raj films YRF Spy Universe Salman Khan Tiger Vs Pathaan

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !