అన్వేషించండి

Don 2 Movie: ‘డాన్ 2’ షూటింగ్‌లో ప్రమాదం - షారుఖ్ ఖాన్ వల్ల మేకర్స్‌కు రూ.2.6 కోట్ల నష్టం

Don 2 Movie: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డాన్ 2’.. 2011లో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. కానీ ఆ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి అందులో నటించిన అలీ ఖాన్ తాజాగా బయటపెట్టాడు.

Shah Rukh Khan Don 2 Movie: ఒక్కొక్కసారి సినిమా షూటింగ్స్‌లో జరిగే ప్రమాదం వల్ల భారీ నష్టం కలగవచ్చు. అలా జరిగిన ప్రమాదాల వల్ల పలువురు స్టార్ హీరోలు గాయాల పాలయ్యారు కూడా. కానీ మూవీ షూటింగ్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ అని హీరోలు వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్ 2’లో తనతో పాటు కలిసి నటించిన అలీ ఖాన్.. ఆ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ వల్ల ఎంత భారీ నష్టం జరిగిందో బయటపెట్టాడు. ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్ కూడా ‘డాన్ 2’ మేకింగ్ వీడియోలో స్వయంగా చెప్పుకొచ్చాడు.

బెర్లిన్‌లో షూటింగ్..

ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో ‘డాన్ 2’ అనే మూవీలో నటించాడు షారుఖ్ ఖాన్. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక కార్ క్రాష్ అవ్వడం వల్ల రూ.2.6 కోట్లు నష్టం కలిగిందని అందులో నటించిన అలీ ఖాన్ బయటపెట్టాడు. అంతే కాకుండా ఆ కార్ క్రాష్ షారుఖ్ ఖాన్ వల్లే జరిగిందని చెప్పుకొచ్చాడు. తనకు షూటింగ్స్‌లో ఎప్పుడూ మేజర్ యాక్సిడెంట్స్ ఏం జరగలేదు అని చెప్తూనే ‘డాన్ 2’ షూటింగ్ సమయంలో ఏం జరిగిందో గుర్తుచేసుకున్నాడు అలీ ఖాన్. ‘‘ఆరోజు సండే. బెర్లిన్‌లో ఒక కార్ చేజ్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాం. షారుఖ్ లెఫ్ట్‌లో కూర్చున్నాడు. నేను రైట్‌లో ఉన్నాను. ఫర్హాన్ అఖ్తర్ వెనుక సీట్‌లో కెమెరాకు కనిపించకుండా దాక్కున్నాడు’’ అంటూ ప్రమాదం సమయంలో ఏం జరిగిందో వివరించాడు అలీ ఖాన్.

రిహార్సెల్ సక్సెస్..

‘‘కార్ బానెట్‌పై హెచ్‌ఎమ్ఐ లైట్స్, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. ఆ వస్తువుల విలువ అన్నీ కలిపి దాదాపు 3 లక్షల యూరోలు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2.6 కోట్లు. అవన్నీ పెట్టేసరికి కారు బ్యాలెన్స్ తప్పింది’’ అని చెప్పుకొచ్చాడు అలీ ఖాన్. రిహార్సెల్ సమయంలో షారుఖ్ ఖాన్ ఆ సీన్‌ను చాలా బాగా చేశాడు. ఇదే విషయాన్ని షారుఖ్‌కు చెప్పగా.. ‘‘నేను ఇప్పటికీ ఎన్నో కార్లు నడిపాను. కానీ ఎప్పుడూ మేజర్ యాక్సిడెంట్ జరగలేదు’’ అని తనతో అన్నాడని గుర్తుచేసుకున్నాడు. రిహార్సెల్ బాగా వచ్చిందని షూటింగ్ స్టార్ట్ చేయగానే షారుఖ్‌ బ్యాలెన్స్ కోల్పోయి.. వేరే స్టంట్ కారును ఢీకొట్టాడని చెప్పాడు అలీ ఖాన్.

రెప్పపాటులో జరిగిపోయింది..

‘‘షారుఖ్ లెఫ్ట్‌కు తిరగడంలో కొన్ని సెకండ్లు లేట్ అవ్వడంతో ఇంకొక స్టంట్ కారు నేరుగా వచ్చి మమ్మల్ని ఢీకొట్టింది. వెంటనే షారుఖ్.. నావైపు చూసి నేను ఓకేనా కాదా అని అడిగాడు. నేను బాగానే ఉన్నానని చెప్పాను. అందరూ చుట్టూ చేరి అంతా ఓకేనా కాదా అని చూశారు. కానీ ఆ ప్రమాదం వల్ల కెమెరా పరికరాలు అన్నీ డ్యామేజ్ అవ్వడంతో 3 లక్షల యూరోలు నష్టం జరిగింది. అంతా రెప్పపాటులో జరిగిపోయింది’’ అని అలీ ఖాన్ వివరించాడు. ఈ విషయం గురించి ‘డాన్ 2’ మేకింగ్ వీడియోలో మాట్లాడిన షారుఖ్ ఖాన్.. అది కష్టమైన షాట్ కాదని, కానీ తను ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ఓపెన్‌గా చెప్పారు షారుఖ్.

Also Read: జాన్వీ కపూర్ బంపర్ ఆఫర్ - శ్రీదేవి ఇంట్లో ఉండేందుకు అరుదైన అవకాశం, మీరు సిద్ధమేనా?

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Korean Kanakaraju Release Date: ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?
ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget