అన్వేషించండి

Shah Rukh Khan: షారుఖ్ పాటకు మోహన్‌లాల్ స్టెప్పులు - మీతో డిన్నర్ చేయాలని ఉందంటూ బాద్‌షా ట్వీట్

Shah Rukh Khan: తాజాగా ఒక అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్‌లాల్.. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో షారుఖ్ పాటకు స్టెప్పులేయడంతో బాలీవుడ్ బాద్‌షా ఫిదా అయిపోయి డిన్నర్‌కు వస్తానంటూ ట్వీట్ చేశారు.

Shah Rukh Khan And Mohanlal Conversation In Twitter: సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విటర్‌లో అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీల మధ్య జరిగే సంభాషణలు చాలా ఫన్నీగా ఉంటాయి. మామూలుగా ట్వటర్.. ఫ్యాన్ వార్స్‌కు ఫేమస్. కానీ ఆ ఫ్యాన్ వార్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం స్టార్ హీరోలు సైతం అప్పుడప్పుడు తమ ఫన్నీ సంభాషణలతో నెటిజన్లను అలరిస్తుంటారు. అలాంటి ఒక సంభాషణ తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మధ్య జరిగింది. తాజాగా జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్‌లో యంగ్ హీరోలతో సమానంగా డ్యాన్స్ చేశారు మోహన్‌లాల్. ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన షారుఖ్.. ట్విటర్‌లో మెసేజ్ చేశారు.

సగం కూడా చేయలేదు..

కొచ్చీలో జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్‌లో చాలాకాలం తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మోహన్‌లాల్. ఆయన రజినీకాంత్‌తో పాటు షారుఖ్ ఖాన్ పాటకు కూడా స్టెప్పులేశారు. షారుఖ్ హీరోగా వచ్చిన ‘జవాన్’ సినిమాలోనే ‘జిందా బందా’ పాటకు మోహన్‌లాల్ వేసిన స్టెప్పులు తనను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ట్విటర్ ద్వారా ఈ పర్ఫార్మెన్స్‌పై స్పందించాడు బాలీవుడ్ బాద్‌షా. ‘ఈ పాటను నాకు మరింత స్పెషల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మోహన్ లాల్ సార్. మీరు చేసిన దాంట్లో నేను సగం అయినా చేసుకుంటే బాగుండేది. లవ్ యూ సార్. మీ ఇంటి దగ్గర డిన్నర్ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. మీరు నిజంగానే ఓజీ జిందా బందా’ అని ప్రశంసించాడు షారుఖ్. దానికి మోహన్ లాల్ రిప్లై కూడా ఇచ్చారు.

ఎవరి ప్లేస్?

‘డియర్ షారుఖ్ ఖాన్. నీలాగా ఎవరూ చేయలేరు. నువ్వు నీ స్టైల్‌లో ఎవరూ ఇమిటేట్ చేయలేని ఓజీ జిందా బందావి. నీ మంచి మాటలకు చాలా థ్యాంక్యు. అయినా డిన్నర్ మాత్రమే ఎందుకు? బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా జిందా బందా పాటను ఎంజాయ్ చేద్దాం’ అంటూ షారుఖ్ ఖాన్‌ను తన ఇంటికి ఆహ్వానించారు మోహన్‌లాల్. దీనికి షారుఖ్ మళ్లీ రిప్లై ఇచ్చారు. ‘కచ్చితంగా చేద్దాం సార్. మీ ప్లేస్‌లోనా? నా ప్లేస్‌లోనా?’ అని తిరిగి ప్రశ్నించాడు. ఇక మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ బాలీవుడ్, మాలీవుడ్ కలిసిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్గెస్ట్ హిట్..

2023లో షారుఖ్ ఖాన్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అందులో ‘జవాన్’ కూడా ఒకటి. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ షారుఖ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా చేరింది. కలెక్షన్స్ విషయంలో కూడా ‘జవాన్’.. ఎన్నో రికార్డులను తిరగరాసింది.

Also Read: ఇక బాలీవుడ్‌ను కాపాడేది టాలీవుడ్‌ హీరోలే - హాట్‌టాపిక్ అవుతున్న హిందీ క్రిటిక్ పోస్ట్‌

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Embed widget