Shabaash Mithu Teaser: మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు' టీజర్ వచ్చింది! 'మిథు'గా తాప్సిని చూశారా?
Shabaash Mithu, The biopic on the life of cricket legend Mithali Raj teaser released: క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు' టీజర్ విడుదల చేశారు.
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj Biopic) జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'శభాష్ మిథు' (Shabaash Mithu). ఇందులో తాప్సి పన్ను (Taapsee Pannu ) టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. ఇందులో విజువల్స్ ఎక్కువ చూపించలేదు. కేవలం మిథాలీ రాజ్ సాధించిన రికార్డులను మరోసారి గుర్తు చేశారు. చివర్లో, మిథాలీగా తాప్సిని చుపించారు. త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
"జెంటిల్‌మన్ స్పోర్ట్ (క్రికెట్) లో చరిత్రను తిరగ రాయడానికి ఆమె ఇబ్బంది పడలేదు. నిజం చెప్పాలంటే... తన కథను సృష్టించారు (సరికొత్త చరిత్ర రాశారు)" అని తాప్సి ట్వీట్ చేశారు.
"వరుసగా ఏడు వన్డేలలో హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్, నాలుగు ప్రపంచ కప్ లలో కెప్టెన్ గా చేసిన ఘనత, టెస్ట్ క్రికెట్ హిస్టరీలో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్, 23 ఏళ్లుగా ఆడుతున్న క్రికెటర్..." అని 'శభాష్ మిథు' టీజర్ లో పేర్కొన్నారు. కరోనా వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. తొలుత ఈ ఏడాది ఫిబ్రవరి 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కుదరలేదు, ఇప్పుడు త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేసిన సమంత
Also Read: థియేటర్లలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ సినిమాకు ఎదురులేదు. మరి, ఓటీటీల్లో? - ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు ఇవే
View this post on Instagram