Shobana: నటి శోభన ఇంట్లో చోరీ - ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యం!
ఇటీవల శోభన పోలీసులకు ఇచ్చిన చోరీ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడమే కాకుండా.. మళ్లీ ఆ నిందితులనే హెల్పర్‌గా చేర్చుకుందని సమాచారం.
సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ తమ పనుల్లో బిజీగా ఉంటారు. అందుకే వారికి ఎప్పుడూ తోడుగా ఉండడం కోసం మేనేజర్స్‌ను, హెల్పర్స్‌ను సహాయంగా పెట్టుకుంటారు. వారికి నమ్మి ఫైనాన్స్ విషయాలు, ఇంటి విషయాలు అన్నీ వారికి అప్పగిస్తారు. అందుకే సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే వారి డ్రైవర్లు, మేనేజర్స్, పర్సనల్ అసిస్టెంట్స్ దగ్గరే చాలా సమాచారం దొరుకుతుంది అని అంటుంటారు. కానీ అంతలా నమ్మి దగ్గర పెట్టుకున్న మనుషుల చేతిలోనే కొందరు సెలబ్రిటీలు మోసపోతున్నారు. ఇప్పటికే ఇలా చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. తాజాగా నమ్మి పని ఇచ్చిన వ్యక్తి చేతిలో మోసపోయిన లిస్ట్‌లోకి మరో సీనియర్ హీరోయిన్ యాడ్ అయ్యింది. తను మరెవరో కాదు.. అలనాటి నటి శోభన. కానీ మోసం చేసిన వ్యక్తిని శోభన ఎలాంటి శిక్ష విధించకుండా వదిలేయడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది.
క్షమించి వదిలేసింది..
చెన్నైలోని శోభన నివాసంలో హెల్పర్‌గా పనిచేసే ఒక మహిళ తాజాగా రూ.41,000ను చోరీ చేసి దొరికిపోయింది. దీంతో ఆగ్రహంతో ఆ మహిళపై శోభన పోలీస్ కేసు కూడా పెట్టింది. పోలీసులు.. మహిళను విచారణకు పిలిచారు. విచారణలో తన తప్పును ఒప్పుకుంది. దీంతో శోభన కేసును వెనక్కి తీసుకోవడం మాత్రమే కాకుండా మళ్లీ తనను హెల్పర్‌గా చేర్చుకుందని సమాచారం. నెలనెలా తనకు ఇచ్చే జీతం నుంచి 41 వేలను కట్ చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు కూడా మీడియాతో తెలిపారు. తాము శోభన ఇంట్లో హెల్పర్‌గా పనిచేసే మహిళను కస్టడీలోకి తీసుకొని విచారించామని, ఆ సమయంలో మహిళ తన తప్పును ఒప్పుకుందని, అది తెలుసుకున్న శోభన కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు చెన్నై మీడియాతో తెలిపారు.
చెన్నైలోని తెయినంపేట్‌లో శ్రీమాన్ శ్రీనివాస రోడ్‌లోని ఒక ఇంట్లో శోభన నివాసం ఉంటున్నట్టు సమాచారం. అయితే జులై 27న తన ఇంట్లో చోరీ జరిగిందని శోభన.. తెయినంపేట్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారించిన తర్వాత ఆ ఇంట్లో పనిచేసే మహిళనే చోరీకి కారణమని తెలుసుకొని, తనను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన వెంటనే ఆ మహిళ తన తప్పును ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత శోభన కేసును వెనక్కి తీసుకోవడం మాత్రమే కాకుండా తనపై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ శోభన ఇంట్లో చోరీ జరగడం ఇదేమీ మొదటిసారి కాదట. ఇంతకు ముందు కూడా శోభన తల్లి ఆనందం.. పలుమార్లు తన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తూ ఉండేదని తెలుస్తోంది.
ఇది మొదటిసారి కాదు..!
చెన్నై మీడియా తెలిపినదాని ప్రకారం శోభన ఇంట్లో పనిచేస్తున్న మహిళ.. ఇప్పటికే పలుమార్లు ఆ ఇంట్లో నుంచి చోరీ చేసి.. తన కూతురు అకౌంట్‌కు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మహిళకు శోభన డ్రైవర్ కూడా సాయం చేస్తున్నట్టు సమాచారం. అయినా కూడా శోభన మళ్లీ ఆ మహిళను నమ్మి తనకు పని ఇవ్వడం అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంచి మనసు ఉండవచ్చు కాదు పలుమార్లు ఇలాంటి తప్పు చేసిన వారిని క్షమించడం కూడా అంత మంచి నిర్ణయం కాదని తన ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. ఇక ఎన్నో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శోభన.. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది.
Also Read : ఒక్కసారి మాలా బ్రతికి చూడండి అన్నయ్య - చిరంజీవిపై 'బేబీ' డైరెక్టర్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial