అన్వేషించండి

Chiranjeevi: ఒక్కసారి మాలా బ్రతికి చూడండి అన్నయ్య - చిరంజీవిపై 'బేబీ' డైరెక్టర్ కామెంట్స్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన 'బేబీ' సినిమా భారీ విజయాన్ని అందుకోగా.. తాజాగా నిర్వహించిన మెగా కల్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మెగాస్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓ చిన్న సినిమాగా విడుదలైన 'బేబీ' ఏకంగా ఇప్పటి వరకు రూ.75 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. కలెక్షన్స్ తో పాటు ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలోనే సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా జూలై 20న మెగా కల్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్లో దర్శకుడు సాయి రాజేష్ మెగాస్టార్ అంటే తనకు ఎంత ఇష్టమో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇక ఈ ఈవెంట్లో సాయి రాజేష్ మాట్లాడుతూ.."ఒక చిరంజీవి ఫ్యాన్‌కి ఉండే అదృష్టాలు మీకు ఉండవు అన్నయ్య. మేము ఎలా ఉంటాం.. ఏం చేస్తాం.. అనేది మీరు చూడలేరు. మేము ఏదైనా డిప్రెషన్ లో ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ లో ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట.. మీరే మా పారాసెటమల్, మీరే మా మ్యాన్షన్ హౌజ్, మీరే మా సింగిల్ మార్ట్.. అన్ని మీరే.. అమెరికాలోని డల్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా.. రోజంతా ఎంతో కష్టపడే ఆటోవాలా అయినా.. ఎవరైనా అందరూ చిరంజీవి అభిమానులే. చిరంజీవి అభిమానులు అంతటా ఉంటారు. నేను దర్శకుడిని అయితే నా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పడగానే చిరంజీవి ఫోటో ఉండాలని అనుకున్నాను. అలా నేను చేసిన నాలుగు సినిమాల్లో మీ ఫోటో ఉంటుంది. నేను నాస్తికుడిని అన్నయ్య. మీ ఫోటో పడిన తర్వాతే నా సినిమా స్టార్ట్ అవుతుంది. కొన్ని లక్షల మందికి దేవుడు అన్నయ్య మీరు. మా జీవితాల్లో ఉన్నందుకు మీకు చాలా థాంక్స్. సాయి రాజేష్ అంటే చిరంజీవి అభిమానుల్లో చిరంజీవి లాంటోడు. నేను అలాగే ఫీల్ అవుతా. ప్రతి ఫ్యాన్ ఇలానే ఫీల్ అవుతాడు" అని సాయి రాజేష్ చెప్పారు.

"మీ ఎదురుగా కూర్చుని ఆరోజు మాట్లాడినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు అసలు మీరు ఏం మాట్లాడారో సగం వినను కూడా వినలేదు. ఎందుకంటే అప్పుడు నా జీవితం మొత్తం కనిపించింది. సినిమా డైలాగ్ అనుకుంటారేమో కానీ.. మీరు అడగండి అన్నయ్య.. ప్రాణం ఇచ్చేస్తామ్" అంటూ ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సాయి రాజేష్. దీంతో మెగాస్టార్ పై సాయి రాజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఈవెంట్ కంటే ముందు దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కే ఎన్ మెగాస్టార్ ని కలిశారు. సుమారు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు ఆ తర్వాత 'బేబీ' సినిమా చాలా బాగుందని చిరంజీవి మూవీ టీం ని ప్రత్యేకంగా అభినందించారు.

ఇక బేబీ విషయానికి వస్తే.. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కే ఎన్ ఈ సినిమాని నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. MN బాల్ రెడ్డి కెమెరా మెన్ గా వ్యవహరించిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీ రోల్ ప్లే చేయగా.. మెగాబ్రదర్ నాగబాబు, సీత, కుసుమ వైవా హర్ష తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : బాలీవుడ్ తండ్రీ కొడుకులతో అక్రమ సంబంధం - ఆ సినీ క్రిటిక్‌పై మహిళా కమిషన్‌కు సెలీనా ఫిర్యాదు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget