బాలీవుడ్ తండ్రీ కొడుకులతో అక్రమ సంబంధం - ఆ సినీ క్రిటిక్‌పై మహిళా కమిషన్‌కు సెలీనా ఫిర్యాదు
ఫిలింక్రిటిక్ ఉమైర్ సంధు గత కొద్ది నెలల క్రితం సెలీనా జైట్లీపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేయగా.. దీనిపై సీరియస్ యాకన్ తీసుకోవాలని సెలీనా జైట్లీ భారత మహిళా కమిషన్ ని ఆశ్రయించారు.
బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాడు. సినిమాలకు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడమే కాకుండా సినీ సెలబ్రిటీలపై ఏదో ఒక విమర్శ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాడు. అలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీస్ పై ఉమైర్ సందు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని కొద్ది నెలల క్రితం బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీపై ఉమైర్ సందు సంచలన ట్వీట్స్ చేశారు. "బాలీవుడ్‌లో తండ్రి కొడుకులు ఫిరోజ్ ఖాన్, ఫర్ దిన్ ఖాన్‌లతో పడుకున్న ఏకైక హీరోయిన్ సెలీనా జైట్లీ’’ అని ఉమైర్ సందు ఓ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ బీ టౌన్ లో తీవ్ర దుమారం రేపింది. సెలీనా జైట్లీ సైతం సోషల్ మీడియా వేదికగా ఈ ట్వీట్ పై ఘాటుగా స్పందించింది. మేరకు ఆమె రిట్వీట్ చేస్తూ.." మిస్టర్ సందు.. కనీసం నువ్వు ఇప్పుడైనా మనిషిగా మారుతావు అనే ఉద్దేశంతో ఈ పోస్ట్ పెడుతున్నాను. నువ్వు ముందు వెళ్లి మంచి డాక్టర్ని కలువు. తర్వాత నీ లైంగిక సమస్య నుంచి ఉపశమనం పొందుతావు" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
అయితే మళ్లీ ఇప్పుడు తాజాగా ఆమె ఉమైర్ సంధు పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్స్ చేసింది. ఈ మేరకు సెలీనా తన ట్వీట్లో పేర్కొంటూ.." కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ తన ట్విట్టర్లో నా గురువు ఫిరోజ్ ఖాన్, అతని కుమారుడు ఫర్ దిన్ ఖాన్ ఇద్దరితో అక్రమ సంబంధాలు ఉన్నాయని పలు వాదనలు చేశాడు. అంతేకాదు నేను ఆస్ట్రియాలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. అతని వేదింపులకు, ఫేక్ క్లెయిమ్స్ కి నా ప్రతిస్పందన ఎంతో వైరల్ గా మారింది. దీని పట్ల పాకిస్తానీ జాతీయులతో సహా మిలియన్ల మంది ట్విట్టర్ ల నుంచి నాకు మద్దతు లభించింది. ఇక నేరస్థుడు సోషల్ మీడియాలో తన లొకేషన్ ని ఎప్పటికప్పుడు మార్చేస్తున్నాడు. కానీ అతను పాకిస్తాన్లోని దాక్కున్నాడు. అందుకే నాకు న్యాయపరమైన ఆశ్రయం లభించలేదు. మన దేశ సరిహద్దు అవతల ఉండి నన్ను, నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూనే ఉన్నాడు’’ అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
"నేను ఈ విషయాన్ని మన దేశంలో ఉన్న జాతీయ మహిళా కమిషన్ వద్దకు తీసుకెళ్లాను. వాళ్లు నా ఫిర్యాదును స్వీకరించి అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సంఘటనను మంత్రిత్వ శాఖ అత్యంత సీరియస్ గా పరిగణిస్తూ తక్షణ విచారణ , చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ ని కోరింది. ఇది కేవలం అతను నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడనే కారణంతో నేను చేస్తున్న పోరాటం కాదు. నా సమగ్రత, మాతృత్వంజ్ నా కుటుంబం , అన్నిటికంటే మించి నాకు గాడ్ ఫాదర్ , నా ప్రియమైన గురువు ఫిరోజ్ ఖాన్ ఈ ప్రపంచంలో లేరు. అతను నా స్నేహితుడు, నా మార్గదర్శకుడు. అతను నాకు ఇచ్చిన ప్రేమ గౌరవం , వృత్తికి నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అని రాసుకొచ్చారు.
"నేనొక ఆర్మీ మ్యాన్ కూతురిని. ఈ వ్యక్తికి గుణపాఠం చెప్పేందుకు నా చివరి శ్వాస వరకు పోరాడుతాను. జాతీయ మహిళా కమిషన్ అలాగే శ్రీమతి కుష్సుందర్ గారికి, చైర్ పర్సన్ శ్రీమతి రేఖ శర్మ అన్నిటికంటే మంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత ప్రభుత్వం నా కంప్లైంట్ ను స్వీకరించి చర్యను ప్రారంభించడం ప్రతి భారతీయ మహిళా గర్వాన్ని నిలబెట్టాయి. ఈరోజు ఓ భారతీయ మహిళగా ఎంతో గర్వపడుతున్నాను. నా తండ్రితో సహా నా కుటుంబంలోని 4 తరాలు మన దేశానికి తమ రక్తాన్ని అందించాయి. ఈరోజు వాళ్ళు ఈ ప్రపంచంలో లేనప్పుడు భారత ప్రభుత్వం నాకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది" అంటూ పేర్కొన్నారు సెలీనా జైట్లీ.
A few months ago, a self-proclaimed Hindi film critic and journalist from Pakistan named @UmairSandu took to Twitter to make viral untrue horrific claims about me which included bizarre allegations like my relations with both my mentor Feroz Khan and his son Fardeen , in addition… pic.twitter.com/xAtxdE8Jzb
— Celina Jaitly (@CelinaJaitly) July 30, 2023
Also Read : 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్వీర్'