News
News
వీడియోలు ఆటలు
X

Naresh Pavitra Love Story: పదేళ్లు మాటల్లేవు, ఆ మూవీలోనే ప్రేమ పుట్టింది - తమ లవ్ స్టోరీ చెప్పిన నరేష్, పవిత్ర

టాలీవుడ్ హాట్ కపుల్ నరేష్, పవిత్ర లోకేష్ 'మళ్లీ పెళ్లి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నరేష్ తమ లవ్ స్టోరీ గురించి వివరించాడు.

FOLLOW US: 
Share:

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు నరేష్ - పవిత్ర లోకేష్. ఇప్పుడు ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. వీరు తాజాగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 26న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ బయట పెట్టారు నరేష్. తాజా ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ.. "ఎప్పుడో 'ఆలయం' సినిమా సమయంలో మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడు పవిత్ర నాతో మాట్లాడలేదు. దాంతో ఈ అమ్మాయికి పొగరేమో అని నేను ముందు లైట్ తీసుకున్నా. మళ్లీ ఆ తర్వాత 10 ఏళ్లకు 'హ్యాపీవెడ్డింగ్' షూటింగ్ సమయంలో కలుసుకున్నాం. ఆ టైంలో నాతో గలగలా మాట్లాడుతూనే ఉంది. షూటింగ్ జరుగుతుండగానే నా గురించి చాలా విషయాలు తెలుసుకుంది. అప్పుడు నేను షాక్ అయ్యా. ఆ టైంలోనే ఈ అమ్మాయి బాగుంది, అందంగా ఉందనిపించి ఓ పాజిటివ్ ఎనర్జీ కలిగింది. ఇక షూటింగ్ అయిపోయాక మళ్ళీ నాతో మాట్లాడలేదు’’ అని తెలిపారు.

‘‘ఆ తర్వాత మళ్లీ 'సమ్మోహనం' సినిమా షూటింగ్లో కలుసుకున్నాం. ఇక షూటింగ్ టైం లో తను ఫ్యాన్ పెట్టుకొని కూర్చుంది. దాంతో నీ స్మెల్ నచ్చింది అని తనతో ఓపెన్ గా చెప్పాను. అప్పుడు తనేదో పర్ ఫ్యూమ్ పేరు చెప్పింది. అది కాదు మీ స్మెల్ నచ్చింది అని చెప్పా. ఆ తర్వాత కిచెన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె హుందాతనం, నడక చూసి ఈ అమ్మాయి నా వంటింట్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సహజంగా ఇలాంటి అమ్మాయిని ఎవరైనా చూస్తే తన బెడ్ రూమ్ లో ఉండాలని అనుకుంటారు. కానీ నాకు మాత్రం వంటింట్లో ఉంటే బాగుండు అనిపించింది. అప్పటికే ఫ్యామిలీ లైఫ్ తో నేను సఫర్ అవుతున్నా. దాంతో ఇలాంటి అమ్మాయి తన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. పైగా తాను మంచి వంటలు కూడా వండుతానని నాకు చెప్పింది. ఇక తర్వాత ఒకరోజు మామూలుగా మెసేజ్ పెట్టాను. ఆమె రిప్లై ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మాయి పెద్ద జాదులా ఉంది అని అనుకున్నా. మళ్లీ ఆరు నెలల గ్యాప్ తర్వాత బెంగళూరులో కలిసింది. షూటింగ్ కోసం వచ్చానని చెప్పి, కలుద్దామా అంటే ఓకే చెప్పింది. అలా ఆరోజు ఓ కాఫీ షాప్ లో కలుసుకున్నాం’’ అని నరేష్ పేర్కొన్నారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాంతో ఆ రోజు నుంచి ఇద్దరూ కనెక్ట్ అయిపోయాం. కానీ 'ఐ లవ్ యు' చెప్పుకోలేదు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. మళ్లీ ఆ తర్వాత 'సమ్మోహనం' షూటింగ్లో అనుకోకుండా కలిశాం. అప్పటికే నాకు తనపై ప్రేమ పుట్టింది. తనే నాకు రైట్ పర్సన్ అనిపించింది. దాంతో వెంటనే డిన్నర్ కి తీసుకెళ్లి భోజనం చేశాక 'ఐ లవ్ యు' చెప్పేశాను. కానీ ఆమె మాత్రం సైలెంట్ గా ఉంది. ఏం రియాక్ట్ కాలేదు. దాంతో నాకు వణుకుతో చెమటలు పట్టాయి. ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని అనిపించింది. ఇక ఆ తర్వాత హోటల్లో దిగిపోతున్న సమయంలో నాకు ఆన్సర్ ఇవ్వలేదని అడగ్గా.. 'కీప్ లవింగ్ మీ' అనే మాట చెప్పి వెళ్ళిపోయింది. దాంతో అది నాకేం అర్థం కాలేదు. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మార్నింగ్ మళ్లీ షూటింగ్ వస్తే మామూలుగానే మాట్లాడుతుంది. ఇక నావల్ల కాక ఇంగ్లీషులోఓ పోయెమ్ రాశాను. నన్ను కోపంగా చూసింది. అప్పుడు సెట్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సమక్షంలోనే అందరూ ఉండగానే పవిత్ర చేయి పట్టుకొని తీసుకెళ్లి అందరి ముందు నిలదీశాను. కనీసం అప్పుడు కూడా రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత డిసెంబర్ 31 రోజు విషెస్ చెబుదామని, తనకు గుడ్ న్యూస్ వస్తుందని ఆమె వద్దకు వెళ్ళాను. ఇప్పటికైనా చెప్పు అని అడిగితే అప్పుడు 'ఐ లవ్ యు' అని చెప్పింది" అని తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చారు నరేష్.

Also Read: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు బన్నీ - ప్రోమోతో అదరగొట్టిన అల్లు అర్జున్

Published at : 24 May 2023 03:59 PM (IST) Tags: Naresh Pavitra Lokesh Naresh pavitra Malli Pelli Senior Actor Naresh Pavitra Lokesh Naresh Pavitra Love Story Naresh Pavitra Love

సంబంధిత కథనాలు

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

టాప్ స్టోరీస్

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ