News
News
X

SDT 15 Movie Update : సాయి తేజ్ సినిమాకు భారీ సెట్ - ఇప్పుడు కోటి ఖర్చు, ముందు 40 లక్షలు

సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు వెళుతోంది. అందుకోసం భారీ సెట్ వేశారు.

FOLLOW US: 

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు ఒక సినిమా నిర్మిస్తున్నారు. దీనికి కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా సాయి తేజ్ 15వ సినిమా (SDT 15 Movie) ఇది. ఆయనకు యాక్సిడెంట్ కావడానికి ముందు కొన్ని రోజులు షూటింగ్ చేశారు. కోలుకున్న తర్వాత మళ్ళీ రీ స్టార్ట్ చేశారు. ఈ నెలలో మరోసారి సెట్స్ మీదకు వెళుతున్నారు.

కోటి రూపాయల ఖర్చుతో భారీ సెట్స్
సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా షూటింగ్ 25 శాతం కంప్లీట్ అయ్యింది. లేటెస్ట్ షెడ్యూల్ ఈ నెల 5న స్టార్ట్ కానుంది. దాని కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చుతో సెట్స్ చేశారు. హైదరాబాద్‌లో రెండు సెట్స్ వేశారు. అందులో మేజర్ పార్ట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కేరళలో చేయనున్నారు. ప్రస్తుతం వేసిన సెట్స్ కాకుండా అంతకు ముందు వేసిన సెట్స్‌కు రూ. 40 లక్షలు కంప్లీట్ అయ్యింది.

రెండు నెలల్లో పూర్తి!
మరో రెండు నెలల్లో పాటలు, టాకీ పార్ట్ కంప్లీట్ చేయాలని... నాన్ స్టాప్‌గా షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట. హైదరాబాద్ సెట్స్‌లో షూటింగ్ చేస్తూ చేస్తూ... ఆ తర్వాత నవంబర్‌లో పది పదిహేను రోజులు కేరళ వెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నవంబర్ నెలాఖరుకు సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

వినోదయ సీతం స్టార్ట్ అయితే ఆలస్యం అవుతుందా?
కార్తీక్ వర్మ దండు సినిమా కాకుండా... సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ మరో సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనది భగవంతుడి పాత్ర. ఒకవేళ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే.... సాయి తేజ్ 15వ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కావచ్చు.

Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డ‌మ్‌ వచ్చేదా?

సాయి తేజ్ సినిమాలో హీరోయిన్ ఎవరు?
సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రమిది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. ఇందులో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్. ఇంతకు ముందు ఆమె 'భీమ్లా నాయక్', 'బింబిసార' సినిమాల్లో నటించారు. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్ముడి సినిమా వేడుకలో ఎమోషనల్ అయిన సాయి తేజ్
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ పంజా (Panja Vaisshnav Tej) కథానాయకుడిగా నటించిన 'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga Movie) సెప్టెంబర్ 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సాయి తేజ్ ఎమోషనల్ అయ్యారు. గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడారు. తాను తాగి డ్రైవింగ్ చేయలేదన్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు తన తమ్ముడు, తల్లిదండ్రులు పక్కన ఉన్నారని తెలిపారు. తన తమ్ముడు పక్కన ఉంటే తన బలం అని సాయి తేజ్ అన్నారు. తన తమ్ముడిని హీరోగా ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్... రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా

Published at : 01 Sep 2022 07:28 PM (IST) Tags: Sukumar Sai Dharam Tej SDT 15 Movie Update Karthik Varma Dandu

సంబంధిత కథనాలు

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్‌- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!