News
News
వీడియోలు ఆటలు
X

Samantha: చెవిలో వెంటుకలపై సమంతా గూగుల్ సెర్చ్ - సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

సమంతపై ఇటీవల ఓ నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత ఇలా వ్యంగ్యంగా తన స్పందన వ్యక్తం చేసింది. దీంతో ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

FOLLOW US: 
Share:

మంత నటించిన ‘శాకుంతలం’ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో సమంతా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అందుకు జవాబుగా సమంతా ఒక్కసారిగా లండన్‌లో ప్రత్యక్షమైంది. ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో చాలా వీక్‌గా, అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించిన సమంత.. లండన్‌లో జరిగిన ‘సిటాడెట్’ హాలీవుడ్ వెర్షన్ ప్రీమియర్ షోలో చాలా యాక్టీవ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఇంతలో అంత మార్పా సమంతా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, అంతకంటే ముందు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కూడా ఆమెపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిట్టిబాబు ‘శాకుంతలం’ మూవీ ఫ్లాప్‌పై వ్యాఖ్యలు చేశారు. ఇక సమంత కెరీర్ ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. ఇక ఆమె స్టార్‌డమ్ తిరిగి రావడం కష్టమేనని అన్నారు. ఈ విషయం సమంత చెవిన పడ్డాయో ఏమో.. లేటైనా, లేటెస్టుగా స్పందించింది. అంతేకాదు.. చాలా తెలివిగా ఆయనకు కౌంటర్ వేసింది. గూగుల్ సెర్చ్‌లో How do people have hair growing from ears (మనుషుల చెవుల నుంచి జుట్టు ఎలా పెరుగుతుంది?) అంటూ గూగుల్ సెర్చ్ చేసింది. ఆ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. మీకు తెలిస్తే.. తెలిసినట్లే.. అనే అర్థం వచ్చేలా #IYKYK (If you know, you know) అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టింది. 

ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు.. భలే పంచ్ వేశావంటూ మురిసిపోతున్నారు. అయితే, కొందరు మాత్రం అది అర్థంగాక బుర్ర గోక్కుంటున్నారు. సమంత వేసిన పంచ్ తప్పకుండా నిర్మాత చిట్టిబాబుకేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. ఇటీవల ఆమెపై నోరుపారేసుకున్న ఆ నిర్మాత చెవిలో కూడా వెంటుకలు ఉంటాయని, అందుకే సమంత ఇలా సెటైరికల్‌గా స్పందించిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సమంత ఏదీ దాచుకోదని, తేడా వస్తే ఇలా ఇచ్చి పడేస్తుందని ఫ్యాన్స్ ఆ నిర్మాతను ట్రోల్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.

‘శాకుంతలం’ ఫ్లాప్ తర్వాత.. 

‘శాకుంతలం’ సినిమా, అలాగే సమంతపై వస్తోన్న విమర్శలపై కూడా ఆమె ఇలాగే పరోక్షంగా స్పందించింది. నేరుగా విషయం చెప్పకుండా ఇండైరెక్ట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని షేర్ చేసింది. ‘‘క‌ర్మణ్యే వాధికా ర‌స్తే మా ఫ‌లేషు క‌దాచ‌న మా క‌ర్మ ఫ‌ల‌హేతూర్భూ మా తే సంగోత్సవ ఆక‌ర్మణి’’ అంటూ రాసుకొచ్చింది. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే.. ‘‘పని చేయడం మాత్రమే మన పని. అంతేకాని దాని ఫలితంతో మనకు సంబంధం లేదు. ప్రతిఫలం కోసం ఏ పని చేయకూడదు. అలాగని పని చేయడం మానేయకూడదు’’. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఇది కచ్చితంగా ‘శాకుంతలం’ రిజల్ట్ పట్ల సమంతపై వస్తోన్న విమర్శలకు సమాధానంగానే ఈ శ్లోకాన్ని షేర్ చేసిందంటున్నారు. ఆ వెంటనే ఆమె లండన్‌లో ‘సిటాడెల్’ టీమ్‌తో కనిపించి విమర్శకులకు షాకిచ్చింది. జయపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడమే తన పని అని సమంత అలా స్పష్టం చేసింది.

ఏప్రిల్ 26 నుంచి ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ సీరిస్ స్ట్రీమింగ్

లండన్‌లో జరిగిన ‘సిటాడెల్’ ప్రీమియర్ షోకు ఇండియన్ వెర్షన్ నటీనటులు సమంత, వరుణ్ ధావన్, దర్శకులు రాజ్, డీకే హాజరయ్యారు. ప్రియాంక చోప్రాతో కలిసి సమంతా ఈ షో తిలకించారు. వరుణ్ బ్లాక్ సీ-త్రూ టీ-షర్ట్, మ్యాచింగ్ డెనిమ్‌, షూ, జాకెట్‌ను ధరించగా, సమంత స్టేట్‌మెంట్ నెక్‌పీస్,  బ్రాస్‌ లెట్‌ తో కూడిన బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌లో ఉంది. ఈ కార్యక్రమంలో రాజ్, డీకేతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రియాంక ఆఫ్-షోల్డర్ రెడ్ గౌనులో అందంగా కనిపించారు. నటుడు రిచర్డ్ మాడెన్ బ్లాక్ సూట్‌ వేసుకున్నారు. ప్రియాంక భర్త నిక్ జోనా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా కూడా ఈ ప్రీమియర్‌కు హాజరయ్యారు. ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ కు సంబంధించిన రెండు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కు రానున్నది.  దాని తర్వాత ప్రతి శుక్రవారం మే 26 వరకు వారానికో కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన  ట్రైలర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళం,  కన్నడ, మలయాళంలోనూ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. ‘సిటాడెల్’ స్పై ఏజెంట్లుగా ప్రియాంక, మాడన్ సూపర్ డూపర్ యాక్షన్ తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సైతం ఆకట్టుకున్నాయి. గన్స్, బాంబ్స్ మోతలతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ నిండిపోయింది. ట్రైలర్ స్టార్టింగ్ మొదలుకుని చివరి వరకు కన్ను ఆర్పకుండా చూసేలా ఉంది.

Also Read : 'హలో మీరా' రివ్యూ : స్క్రీన్ మీద కనిపించేది సింగిల్ క్యారెక్టరే - సినిమా ఎలా ఉందంటే?

Published at : 23 Apr 2023 11:20 AM (IST) Tags: Shaakuntalam Samantha Citadel Samantha Chittibabu Samanth Reply to Chittibabu Producer Chittibabu

సంబంధిత కథనాలు

Vimanam Movie Trailer: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్

Vimanam Movie Trailer: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్

Tollywood For BJP: తెలుగు సినిమా కాషాయం కప్పుకుంటోందా? టాలీవుడ్‌ను వాడుకుంటున్న బీజేపీ?

Tollywood For BJP: తెలుగు సినిమా కాషాయం కప్పుకుంటోందా? టాలీవుడ్‌ను వాడుకుంటున్న బీజేపీ?

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

పెళ్లికి వయసుతో సంబంధం లేదు, అదే ముఖ్యం: నటి మాధవీ లత

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ