అన్వేషించండి

Samantha: రాజకీయాల్లోకి సమంత ఎంట్రీ? ఆ పార్టీ తరపున ప్రచారం చేయనుందా?

కొందరు నటీనటులు అటు రాజకీయాలు, ఇటు సినిమాలు.. రెండూ మ్యానేజ్ చేయాలని అనుకుంటారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి ఓ టాలీవుడ్ టాప్ నటి జాయిన్ అవ్వనుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

చాలామంది సినీ సెలబ్రిటీలు.. కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్న తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకోవడం సహజమే. కేవలం హీరోలు మాత్రమే కాదు.. అలా రాజకీయాల్లోకి వెళ్లి తమ సత్తా చాటుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. సినిమాల్లోకి వచ్చి చాలాకాలం అయ్యి.. వారికి అక్కడ అవకాశాలు రాని సమయాల్లో ఎక్కువగా నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొందరు మాత్రం అటు రాజకీయాలు, ఇటు సినిమాలు.. రెండూ మ్యానేజ్ చేయాలని అనుకుంటారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి ఓ టాలీవుడ్ టాప్ నటి జాయిన్ అవ్వనుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తను మరెవరో కాదు.. సమంత రుత్ ప్రభు. అసలు సమంత ఏంటి? రాజకీయాలు ఏంటి? అని ఈ వార్త విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు.

బ్రేక్ అయ్యాక రాజకీయాల్లోకి..
ఇప్పటివరకు కేవలం సౌత్‌లోని సినిమాలు చేసింది సమంత. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కూడా అక్కడ కేవలం ఒక వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. అయినా కూడా తరువాతి సూపర్‌స్టార్ అయ్యే అవకాశాలు సమంతకే ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికీ చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రశంసించారు. సమంత సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆఫర్ల విషయంలో మాత్రం తను ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ చాలామంది మేకర్స్.. సమంత తమ సినిమాలో ఉంటే హైప్ క్రియేట్ అవుతుందని తన డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ మయాసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత.. కొన్నాళ్ల వరకు సినిమాలకు బ్రేక్ తీసుకోనుంది. ఆరు నెలల వరకు బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టనుంది. ఇంతలోనే ఈ ఆరు నెలల బ్రేక్ తర్వాత సమంత అడుగుపెట్టేది సినిమా సెట్స్‌లో కాదని.. రాజకీయ వేదికపై అని టాక్ మొదలయ్యింది.

ఆ పార్టీ తరపున ప్రచారం..
తాజాగా ఒక న్యూస్ ఛానెల్.. సమంత రాజకీయాల్లోకి జాయిన్ అవ్వనుంది అనే వార్తను ప్రసారం చేసింది. ఇప్పుడు ఆ వార్త.. సినీ రంగంలో పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పటివరకు సమంత పలు సందర్భాల్లో రాజకీయ విషయాల్లో యాక్టివ్‌గా ఉంది. అప్పుడప్పుడు తెలంగాణలోని రైతులకు సాయం చేయడానికి తను ముందుకొస్తూ ఉంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చేనేత రంగానికి సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. అదే విధంగా త్వరలో రానున్న ఎలక్షన్స్ సమయంలో భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పార్టీకి సపోర్ట్‌గా సమంత ప్రచారం చేయనుందట. 

‘ఖుషి’తో బ్రేక్..
సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ.. తాజాగా విడుదలయ్యి హిట్ టాక్‌ను అందుకుంది. కానీ ఈ మూవీ ప్రారంభం అయ్యే సమయానికి సమంతకు మయాసిటీస్ వ్యాధి ఉందని తేలింది. దీంతో ‘ఖుషి’ నుండి తను పలుమార్లు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా సినిమాలు ఒప్పుకున్న తర్వాత బ్రేక్స్ తీసుకుంటే బాగుండదని అనుకున్న సమంత.. ‘ఖుషి’ని పూర్తి చేసి.. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ కోసం తను తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేసి పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి విదేశాలకు వెళ్లనుంది. ఇప్పటికే తన చికిత్స కోసం పలుమార్లు విదేశాలకు వెళ్లిన సమంత.. తాజాగా ఇండియాకు తిరిగొచ్చింది. మళ్లీ తను చికిత్స కోసం ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇలాంటి సమయంలోనే తను రాజకీయాల్లో యాక్టివ్ కానుంది అనే వార్త.. ఫ్యాన్స్‌ను అయోమయానికి గురిచేస్తోంది.

Also Read: సౌత్ బాటపడుతున్న బాలీవుడ్ స్టార్స్, విజయ్ దళపతి మూవీలో విలన్‌గా అమీర్ ఖాన్?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget