అన్వేషించండి

Samantha: సల్మాన్ ఖాన్‌తో సినిమాపై సమంత క్లారిటీ - ఆ ఇద్దరికీ లైన్ క్లియర్?

సమంత బాలీవుడ్ డెబ్యూ కోసం తన హిందీ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్‌తో మూవీ చేస్తూ.. బాలీవుడ్ డెబ్యూకు సమంత సిద్ధమయ్యింది అని వార్తలు రావడంతో వారు ఖుష్ అవుతున్నారు.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా పరిచయమయ్యి.. ఆ తర్వాత బాలీవుడ్ నుండి అవకాశాల కోసం ఎదురుచూసి అక్కడే సెటిల్ అయిపోయిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. కానీ అలా కాకుండా సౌత్‌లో ఎంత గుర్తింపు వచ్చినా.. అసలు ఇక్కడి ఇండస్ట్రీని వదిలి వెళ్లని హీరోయిన్స్ కూడా ఉన్నారు. అందులో ఒకరు సమంత. కానీ ఈమధ్య సమంత కూడా బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతోందని, ఒక స్టార్ హీరోతో తన సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత ఈ వార్తలపై పరోక్షంగా స్పందించింది. దీంతో బాలీవుడ్‌లో సమంత డెబ్యూ ఉంటుందా లేదా అని సందేహపడుతున్న తన ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చింది.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో క్రేజ్..
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో సమంతకు మంచి సాన్నిహిత్యం ఉంది. హిందీలో ఒక్క సినిమాలో నటించకపోయినా సామ్‌కు అక్కడ బాగానే పాపులారిటీ లభించింది. దానికి కారణం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్. ఈ సిరీస్ తర్వాత సమంత.. పూర్తిస్థాయిలో హీరోయిన్‌గా ఒక హిందీ చిత్రంలో ఎప్పుడు నటిస్తుందా అని తన ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్‌లో పెరిగిన హైప్ చూసి తనను బాలీవుడ్‌లో లాంచ్ చేయాలని కరణ్ ఎదురుచూస్తున్నాడు. ఇక తాజాగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో సమంతనే హీరోయిన్ అని రూమర్స్.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. ఈ విషయంపై సమంత తాజాగా స్పందించింది. 

ఆరోగ్యంపైనే శ్రద్ధ..
సమంత చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటించింది. ఈ మూవీ క్లిన్ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ దేవరకొండతో సమంత కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ తర్వాత సమంత సినిమాల నుండి కొన్నిరోజులు బ్రేక్ తీసుకోనుందని, తన ఆరోగ్యంపై దృష్టిపెట్టనుందని క్లారిటీ ఇచ్చేసింది. దానికోసం తను ముందుగా ఒప్పుకున్న సినిమాల నుండి కూడా తప్పుకుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే సమంత బాలీవుడ్ డెబ్యూ గురించి రూమర్స్ మొదలయ్యాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో సమంత హీరోయిన్ అనే వార్తలకు తను ఒక క్లారిటీ ఇచ్చింది.

ప్లాన్ లేదు..
తాజాగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంది సమంత. అదే సమయంలో తన బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది. తన తరువాతి ప్రాజెక్ట్ ఏంటి అని సామ్‌ను అడగగా.. ‘నా తరువాతి ప్రాజెక్ట్ అసలు ఏమీ లేకపోవడమే. ప్లాన్ లేకపోవడమే’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ‘నేను పనిచేయబోతున్న ప్రాజెక్ట్స్ గురించి మరింత ఆలోచించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. నా కంఫర్ట్ జోన్ నుండి బయటపడేసే పాత్రలు నాకు కావాలి. అలాంటి పాత్ర వచ్చేవరకు నేను ఇలాగే ఉండడానికి సిద్ధం’ అని సమంత తెలిపింది. దీంతో ప్రస్తుతం సమంత ఇంకా ఏ ప్రాజెక్ట్స్‌ను ఒప్పుకోలేదని ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అనుష్క, త్రిషలకు లైన్ క్లియర్ అయినట్లే. మరి ఈ ఇద్దరిలో ఎవరు సల్లూ భాయ్‌తో జతకడతారో చూడాలి.

Also Read: అలా చేశారని జయసుధపై మోహన్ బాబు సీరియస్ - వీడియో వైరల్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget