Salman Khan Shows Six Pack : షర్ట్ విప్పి మరీ చూపించిన సల్మాన్ - ట్రోలర్స్‌కు ఝలక్!
Salman Khan unbuttons shirt : సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' ట్రైలర్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించారు. అది గ్రాఫిక్స్ అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకు భాయిజాన్ గట్టి ఝలక్ ఇచ్చారు.
![Salman Khan Shows Six Pack : షర్ట్ విప్పి మరీ చూపించిన సల్మాన్ - ట్రోలర్స్‌కు ఝలక్! Salman Khan shows his six pack abs in Kisi Ka Bhai Kisi Ki Jaan, shuts down trolls who claimed six pack abs are fake Salman Khan Shows Six Pack : షర్ట్ విప్పి మరీ చూపించిన సల్మాన్ - ట్రోలర్స్‌కు ఝలక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/7f86f0f5df26bfcdfac12a365d4a05071681188040533209_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie). ఏప్రిల్ 21న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. నిన్న (ఏప్రిల్ 10, సోమవారం) ట్రైలర్ విడుదల చేశారు. అందులో సల్మాన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. నిజంగా సల్లూ భాయ్ సిక్స్ ప్యాక్ చేయలేదని, అది గ్రాఫిక్స్ అని ట్రోల్స్ నడుస్తున్నాయి. వాళ్ళందరికీ కండల వీరుడు ఝలక్ ఇచ్చారు.
షర్ట్ విప్పి మరీ చూపించిన సల్మాన్!
ముంబైలో జరిగిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిక్స్ ప్యాక్ ప్రస్తావన వచ్చింది. ''మీరు ఇది (సిక్స్ ప్యాక్) వీఎఫ్ఎక్స్ సాయంతో చేశారని అనుకుంటున్నారు. కానీ, కాదు. నాకు మొదట ఫోర్ ఫ్యాక్స్ ఉండేవి. జిమ్ చేస్తూ చేస్తూ ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేశా'' అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన వయసు 57 ఏళ్ళు. ఈ వయసులో సిక్స్ ప్యాక్ చేయడం, ఆ జిమ్ బాడీ మైంటైన్ చేయడం మామూలు విషయం కాదు.
ఫిట్నెస్ విషయంలో యంగ్ హీరోలకు సల్మాన్ ఖాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఏ సినిమాకు అయినా సరే అవకాశం అనుకుంటే... ఆయన షర్ట్ విప్పడానికి అసలు వెనుకడుగు వేయరు. సల్మాన్ ఖాన్ అభిమాని ఒకరు షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించిన వీడియో ట్వీట్ చేశారు. ''ఆ కాన్ఫిడెన్స్ లెవల్ ఉండాలి. విమర్శకుల మాటలు తప్పని ప్రూవ్ చేశాడు. వీఎఫ్ఎక్స్ ఏమీ లేదు. బాడీ బిల్డింగ్ చేయడం ద్వారా వచ్చినదే'' అని సల్మాన్ ఫ్యాన్ పేర్కొన్నారు.
Also Read : పవన్ కళ్యాణ్‌తో శ్రీలీల - నేటి నుంచి ఉస్తాద్ లవ్ సీన్లు!
That’s confidence level and proving haters wrong. No VFX sheer body building ❤️❤️. #SalmanKhan𓃵 #KisiKaBhaiKisiKiJaan #KisiKaBhaiKisiKiJaanTrailer
— Being Abhi (@Being_Abhi_23) April 10, 2023
pic.twitter.com/aogOzplZqX
హైదరాబాదీ అమ్మాయిగా పూజా హెగ్డే
'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించారు. ఆమె హైదరాబాదీ అమ్మాయిగా కనిపించారు. ట్రైలర్ చూస్తే... రెండు మూడు చోట్ల పూజా తెలుగు డైలాగ్ చెప్పారు. సినిమాలో కథానాయికకు అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. విలన్ పాత్రలో జగపతిబాబు కనిపించారు. సినిమాలో వీళ్ళు నటించడంతో పాటు 'ఏంటమ్మా...' పాటలో రామ్ చరణ్ స్పెషల్ అప్పీరియరెన్స్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.
'ఏంటమ్మా...'లో చరణ్ స్టైలిష్ ఎంట్రీ!
'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా నుంచి ఈ రోజు 'ఏంటమ్మా...' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్! 'ఏంటమ్మా...' సాంగ్ పూర్తిగా సౌత్ స్టయిల్ లో సాగింది. సల్మాన్ ఖాన్, వెంకీ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశారు. అయితే... రామ్ చరణ్ ఎంట్రీ తర్వాత కంప్లీట్ వైబ్ మారింది. ఆల్రెడీ ఈ సినిమాలో 'బతుకమ్మ' పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. 'కె.జి.యఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా... తెలుగు లిరిక్స్ హరిణి ఇవటూరి, కిన్నల్ రాజ్ రాశారు. హిందీ లిరిక్స్ షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాశారు. 'బతుకమ్మ' వీడియో సాంగులో బుట్టబొమ్మ పూజా హెగ్డే డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చక్కగా చేశారు.
Also Read : అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)