అన్వేషించండి

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ప్రాణ హాని ఉన్నా... హైదరాబాద్ సిటీలో షూటింగ్ - ఎందుకో తెలుసా?

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నప్పటికీ సల్మాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఆయన హైదరాబాద్ లో ‘సికిందర్‘ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు.

Salman Khan resumes Sikandar Shoot: గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ బ్యాచ్ నుంచి హత్యా బెదిరింపులు ఎక్కువయ్యాయి. కచ్చితంగా ఆయనను చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, ఈ బెదిరింపులను సల్మాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. పోలీసులు కొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించినప్పటికీ, షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన హీరోగా ‘సికిందర్’ అనే యాక్షన్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఐకానిక్ ఫలక్ నుమా ప్యాలెస్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ మూవీ షూటింగ్ కు ఆయన హాజరయ్యారు. తాజాగా ఈ షూటింగ్ కు సంబంధించిన రెండు వీడియోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో సల్మాన్ లొకేషన్ కు చేరుకున్న విజువల్స్ ఉండగా, మరో వీడియోలో సల్మాన్ డూప్ ముందు రష్మిక డైలాగ్ చెప్తున్నట్లు కనిపిస్తోంది.  

సల్మాన్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న అభిమానులు

హత్యా బెదిరింపులను పట్టించుకోకుండా సినిమా షూటింగ్ లో పాల్గొనడం పట్ల పలువురు నెటిజన్లు సల్మాన్ ను ప్రశంసిస్తున్నారు. “సినిమాల పట్ల సల్మాన్ కు ఉన్న నిబద్దతకు నిదర్శనం” అంటూ అభినందిస్తున్నారు. “సల్మాన్ ధైర్యానికి ఇదే పెద్ద ఎగ్జాంఫుల్” అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “సల్మాన్ తప్పు చేయలేదు కాబట్టే, ధైర్యంగా బయట తిరుగుతున్నారు” అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. “తాటాకు చప్పుళ్లకు సల్మాన్ భాయ్ బయటపడడు” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.  

‘సికిందర్’ సినిమా గురించి..

ప్రముఖ తమిళ దర్శకుడు AR మురుగదాస్‌ తో కలిసి సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ అనే సినిమా చేస్తున్నారు. యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను సాజిద్ నడియాడ్‌ వాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది( 2025) ఈద్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోసారి సల్మాన్ కు బెదిరింపులు  

గత కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్ కు వరుసగా హత్యా బెదిరింపులు వస్తున్నాయి. రీసెంట్ గా ఆయను చంపుతామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపించిన వ్యక్తిని కర్ణాటకలో గుర్తించారు.  ప్రస్తుతం అతడు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు ముంబై పోలీసులు భావిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ప్రయత్నిస్తోంది. మరికొంత మంది లారెన్స్ గ్యాంగ్ పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం కలిగించింది. బిష్ణోయ్ బ్యాచ్ తో వైరం వద్దనుకుంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తంగా ఈ నెలలో ఆయనకు మూడుసార్లు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ లో సల్మాన్ సన్నిహితులు, ప్రముఖ మహారాష్ట్ర నాయకుడు బాబా సిద్ధిఖ్ ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. దసరా సందర్భంగా బాణాసంచా కాల్చుతుండగా బైక్ మీద వచ్చిన దుండగులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు.  ఆ తర్వాత సల్మాన్ కు  బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.   

Read Also: సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్‌ రన్ టైమ్ ఎంత? టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయ్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Embed widget