Salaar Collections : రూ.600 కోట్ల క్లబ్‌లో చేరిన 'సలార్' - ప్రభాస్ ఖాతాలో ఇది మూడోది!
Salaar : ప్రభాస్ సలార్ మూవీ తాజాగా రూ.600 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూడవ చిత్రంగా 'సలార్' నిలిచింది.
Salaar Collections : టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయారు. భారతీయ సినీ చరిత్రలో ఒక్క సినిమాతో ఈ రేంజ్ లో పాపులారిటీ మరే హీరోకి రాలేదేమో. ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్ పదింతలు పెరిగింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ డిజాస్టర్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ రావడంతో రెబల్ స్టార్ మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదని తాజాగా 'సలార్' మరోసారి నిరూపించింది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే రూ.180 కోట్లు కలెక్ట్ చేసి ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా థర్డ్ వీకెండ్ ని ముగించుకుంది. సంక్రాంతి వరకు పెద్దగా కొత్త సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడో వారంతం ముగించుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రూ.600 కోట్ల గ్రాస్ మార్క్ దాటింది. సలార్ రిలీజైన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన అందుకుంది. అయితే సినిమాలో యాక్షన్ లవర్స్ ని మెప్పించే అంశాలు ఉండడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి తెలుగు, హిందీ(డబ్బింగ్ వెర్షన్)లో మాత్రమే భారీ ఆదరణ లభించింది.
మిగతా భాషల్లో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 17వ రోజు పూర్తయ్యే సమయానికి ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.394.10కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు రూ.135 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకొని 2023 గ్లోబల్ వైడ్ గా సక్సెస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా 2023 లో రిలీజ్ అయిన పఠాన్, గదర్ 2, జైలర్, జవాన్, లియో, యానిమల్ వంటి సినిమాల తర్వాత రూ.600 కోట్లు కలెక్ట్ చేసిన ఏడవ భారతీయ చిత్రంగా 'సలార్' నిలవడం విశేషం.
మరో అరుదైన విషయమేంటంటే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన ప్రభాస్ మూడవ చిత్రం గా 'సలార్' నిలిచింది. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి-1 ఫుల్ రన్ లో రూ.650 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు 'సలార్' తక్కువ సమయంలోనే రూ.600 కోట్ల క్లబ్లో చేరింది. కేజీఎఫ్ సినిమాని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించగా మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావ్ కీలక పాత్రలు పోషించారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందించగా రవి బాస్రూర్ సంగీతం సమకూర్చారు.
Also Read: 'కేజీఎఫ్' హీరో యశ్ బర్త్ డే వేడుకల్లో అపశృతి - ముగ్గురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం