Sai Dharam Tej: మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్‌కే ఆ ట్యాగ్ ఇస్తున్న హీరోయిన్లు - కేతికా కూడా ఆ మాట అనేసింది
Sai Dharam Tej: మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్‌కే హస్బెంబ్ మెటీరియల్ ట్యాగ్‌ను ఇచ్చేస్తున్నారు హీరోయిన్లు. దాని వెనుక వారి వారి కారణాలు కూడా బయటపెడుతున్నారు.
Ketika Sharma about Sai Dharam Tej: మెగా ఫ్యామిలీ చాలామంది టాలీవుడ్‌కు హీరోలుగా పరిచయమయ్యారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలంతా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో ఒకే హీరోయిన్‌తో ఇద్దరు లేదా ముగ్గురు మెగా హీరోలు యాక్ట్ చేయడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఆ హీరోయిన్ల లిస్ట్‌లో లావణ్య త్రిపాఠి, కేతిక శర్మ కూడా ఉంటారు. వీరిద్దరూ పలువురు మెగా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే మెగా హీరోలు అందరిలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు అనే ప్రశ్నకు వీరిద్దరు ఒకే హీరో పేరు చెప్పడం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సాయి ధరమ్ తేజ్‌కే కరెక్ట్..
లావణ్య త్రిపాఠి.. ఇప్పటివరకు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ లాంటి మెగా హీరోలతో నటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకొని మెగా కోడలిగా సెటిల్ అయిపోయింది. ఇక పెళ్లికి ముందు తను కలిసి యాక్ట్ చేసిన మెగా హీరోలలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు అని అడగగా.. సాయి ధరమ్ తేజ్ పేరు చెప్పింది. వరుణ్ తేజ్ హస్బెండ్ మెటీరియలే అని.. కానీ సాయి ధరమ్ తేజ్‌కు ఆ ట్యాగ్ సరిగ్గా సరిపోతుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో ‘ఇంటలిజెంట్’ అనే సినిమా వచ్చింది. కానీ అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయింది. ఇక లావణ్య తర్వాత మరో హీరోయిన్ కూడా సాయి ధరమ్ తేజ్‌కే ఓటు వేసింది.
డీప్ విషయాలు షేర్ చేసుకుంటా..
కేతిక శర్మ.. మెగా బ్రదర్స్ అయిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ భామ. తను కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు అని ప్రశ్నించగా.. సాయి ధరమ్ తేజ్ అని సమాధానం ఇచ్చింది. ఆ ఇద్దరు బ్రదర్స్ చాలా స్వీట్ అని, వారిద్దరికీ తను చాలా క్లోజ్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. వైష్ణవ్, తను చిన్నపిల్లలాగా కొట్టుకుంటామని బయటపెట్టింది. సాయి ధరమ్ తేజ్‌తో అయితే చాలా డీప్ విషయాలు కూడా షేర్ చేసుకుంటానని తెలిపింది. ఇక మెగా యంగ్ హీరోలతో నటించిన ప్రతీ హీరోయిన్.. ఇలా సాయి ధరమ్ తేజ్‌నే హస్బెండ్ మెటీరియల్ అని ప్రకటిస్తున్నారంటూ ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
అప్‌కమింగ్ సినిమాలు..
గతేడాది ‘విరూపాక్ష’తో కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు సాయ్ ధరమ్ తేజ్. ఒక యాక్సిడెంట్ వల్ల కొన్నిరోజులు కోమాలోకి వెళ్లిపోయిన తేజ్.. మళ్లీ వెంటనే కోలుకొని సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. తన వల్ల షూటింగ్స్ ఆలస్యం అవ్వకూడదనే ఉద్దేశ్యంతో సెట్స్‌పై ఉన్న సినిమాలను ముందుగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే క్రమంలో ‘విరూపాక్ష’తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం దర్శకుడు సంపత్ నందితో ‘గాంజా శంకర్’ అనే మాస్ మసాలా మూవీ చేస్తున్నాడు తేజ్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ గ్లింప్స్ కూడా విడుదలయ్యింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.
Also Read: ఆ స్టార్ హీరోయిన్స్‌తో ఎఫైర్ - వారిలో మాజీ విశ్వసుందరి కూడా, పేర్లు బయటపెట్టిన డైరెక్టర్