అన్వేషించండి

Sudheer Babu's Hunt Update : హాలీవుడ్ స్టైల్ స్టంట్స్, యాక్షన్‌తో సుధీర్ బాబు 'హంట్'

సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'హంట్'. మార్వెల్ మూవీస్, హాలీవుడ్ చిత్రాలకు పని చేస్తున్న యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమాకు వర్క్ చేశారు.

నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా నటించిన చిత్రం 'హంట్' (Hunt Movie). హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబుది పోలీస్ రోల్. ఆయన మాత్రమే కాదు... శ్రీకాంత్, భరత్ కూడా పోలీసులుగా కనిపించనున్నారు. పోలీసులు అంటే క్రిమినల్స్‌ను పట్టుకోవడం, వాళ్ళతో ఛేజ్‌లు, ఫైట్లు ఉంటాయి. ఛేజింగులు, ఫైటింగులు అంటే యాక్షన్ కంపల్సరీ. ఆ యాక్షన్ కొత్తగా ఉండేలా 'హంట్' టీమ్ ప్లాన్ చేసింది. 

'హంట్'కు హాలీవుడ్ యాక్షన్ టచ్!
'హంట్'లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజీ 'జాన్ విక్'లో నాలుగో సినిమాకు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు 'హంట్' మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు. 
   
భవ్య క్రియేషన్స్ అధినేత, చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "యాక్షన్ కొరియోగ్రాఫర్లు రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ హాలీవుడ్‌లో పలు హిట్ సిన్మాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా 'హంట్'లో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, 'పాపతో పైలం...' పాట యూట్యూబ్‌లో ట్రెండ్ కావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

Also Read : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ : 'అల్లరి' నరేష్ ఎన్నికల సినిమాకు ప్రేక్షకులు ఓటేస్తారా? లేదా?

ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ మాత్రమే కాదు... కిక్ ఇచ్చే రొమాంటిక్ గ్లామరస్ సాంగ్ ఒకటి ఉందండోయ్! అదే 'పాపతో పైలం...'. 'క్రాక్', 'సీటీమార్' సినిమాల్లో ప్రత్యేక గీతాలతో సందడి చేసిన అప్సరా రాణి (Apsara Rani) ఈ పాటలో స్టెప్పులు వేశారు. 'పాపతో పైలం...' పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా... మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు. తెలుగులో మంగ్లీ పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. 'పుష్ప'లో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' పాటతో పాటు కొన్ని హిట్ సాంగ్స్ నకాష్ అజీజ్ ఖాతాలో ఉన్నాయి. ఈ సాంగ్ కూడా హిట్ అయ్యేలా ఉంది. 

'హంట్' సినిమాలో సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. టీజర్ చూస్తే... సుధీర్ బాబు తన గతం మర్చిపోయాడని తెలుస్తుంది. గతం మరువక ముందు అతడు స్టార్ట్ చేసిన కేస్ ఏమిటి? దాన్ని మళ్ళీ అతడే క్లోజ్ చేయాలని శ్రీకాంత్ ఎందుకు చెబుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని స్పృశిస్తూ... పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు మహేష్ తెలిపారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సులను ఫ్రాన్స్‌లో అక్కడి స్టంట్ డైరెక్టర్స్‌తో తీశామని ఆయన పేర్కొన్నారు.    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget