ఓటీటీ ప్లాట్ ఫామ్ లాక్ చేసుకున్న 'చిన్నా' - స్ట్రీమింగ్ అయ్యేది అందులోనే?
సిద్ధార్థ హీరోగా నటించిన చిన్నా తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లాక్ చేసుకుంది. అక్టోబర్ చివరి వారంలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
సినీ ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ఓ ఎమోషనల్ మూవీతో భారీ కం బ్యాక్ ఇచ్చాడు హీరో సిద్ధార్థ్. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఓయ్' వంటి సినిమాలతో ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన 'చిత్తా' సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తమిళంలో మంచి విజయం అందుకోవడంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. తమిళంలో సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కాగా ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది.
చాలా ఏళ్ల తర్వాత 'చిత్తా' రూపంలో సిద్ధార్ కి భారీ హిట్ దక్కింది. ఇదే సినిమాని 'చిన్నా' పేరుతో తెలుగులో అక్టోబర్ 6న విడుదల చేశారు. ఏషియన్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగులోనూ పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుని ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను లాక్ చేసుకుంది. 'చిన్నా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ చివర్లో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా 'చిన్నా' మూవీ నాన్ థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ హక్కులు సుమారు రూ.15 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఎస్. యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వయంగా సిద్ధార్థ నిర్మించడం విశేషం. నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ ప్రధానుపాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ ఎమోషనల్ పాయింట్ పై నడుస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అరుణ్ కుమార్ కి భారీ ప్రశంసల దక్కాయి. విశ్వ నటుడు కమలహాసన్ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించడం విశేషం. తమిళంలో తొలిరోజు తక్కువ కలెక్షన్స్ దక్కించుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మౌత్ టాక్ తో క్రమక్రమంగా మంచి వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తెలుగులో ఈ చిత్రానికి పెద్దగా థియేటర్స్ దొరకలేదు. విడుదలైన కొన్ని థియేటర్స్ లోనూ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. మరోవైపు 'చిన్నా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధార్థ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని, చిన్నా మూవీ తెలుగు వెర్షన్ హక్కులను తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చిన్న మూవీ తన జీవితంలోనే బెస్ట్ సినిమా అని, ఇంతకన్నా మంచి సినిమా తీయలేనని అన్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నేను తెలుగు ఇండ్రస్ట్రీ నుంచి తప్పుకుంటాననిజ్ ఇక్కడ సినిమాలు చేయనని అన్నారు. కట్ చేస్తే, సిద్ధార్థ్ చెప్పినట్టుగానే ఈ మూవీ ఈ ఇయర్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
Also Read : 'మంగళవారం' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు - రిలీజ్ ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial